Ravi teja: ఖిలాడి టైటిల్ సాంగ్.. రిచ్ లొకేషన్స్.. మాస్ మాహారాజ్ విజువల్స్ అదుర్స్!
మాస్ మహారాజ్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. క్రాక్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినా ఆయన సెట్స్‌పై దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ''. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. కాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. దేవీ శ్రీ బాణీల్లో రామ్ మిరియాల ఆలపించిన ఈ పాటను చాలా రిచ్‌గా రూపొందించినట్లు విజువల్స్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. కథకు సరిగ్గా యాప్ట్ అయ్యేలా ఉన్న ఈ సాంగ్‌కి శ్రీమణి లిరిక్స్ రాశారు. దీపావళి కానుకగా (నవంబర్ 4) కొద్దిసేపటి క్రితం ఈ సాంగ్ రిలీజ్ చేయగా.. విడుదలైన కాసేపట్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. రవితేజ లుక్స్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘రాక్షసుడు’ వంటి విజయం తర్వాత రమేష్ వర్మ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆ అంచనాలకు రెక్కలు కట్టాయి. జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా? భావోద్వేగాలకు ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అని ఆలోచింపజేసే పాత్రల సమ్మేళనమే ఈ 'ఖిలాడి' సినిమా కథ అని సమాచారం. జయంతిలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్ లైన్. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
By November 04, 2021 at 10:51AM
No comments