Acharya: ఇప్పుడు రామ్ చరణ్ వంతు.. హీరోయిన్‌తో ప్రేమ గీతం!! కొరటాల మ్యాజిక్
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటి ''. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకొని భారీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తండ్రి చిరంజీవితో పాటు తనయుడు కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ ప్రేమ గీతం ప్రోమో రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో ఆతృత పెంచేశారు కొరటాల. సిద్ద రోల్ చేస్తున్న చెర్రీతో నీలాంబరిగా నటిస్తున్న ప్రేమలో పడుతుంది. ఆ ఇద్దరి నడుమ చిత్రీకరించిన 'నీలాంబరి' గీతాన్ని (నవంబర్ 5న) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన కొరటాల.. దానికి ఒక రోజు ముందు దీపావళి కానుకగా ఈ సాంగ్ ప్రోమో వదిలారు. ఈ షార్ట్ వీడియోలో రామ్ చరణ్ స్టెప్స్, పూజా హెగ్డే సంప్రదాయ లుక్ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ప్రేమ గీతంపై అందరి చూపు పడింది. గతంలో 'లాహే.. లాహే' పాటతో చిరు ఆకట్టుకోగా ఇప్పుడు చెర్రీ అదే బాటలో వెళ్ళబోతున్నారని ఈ ప్రోమో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. దేవాదాయ శాఖ భూముల స్కామ్ నేపథ్యంలో సందేశాత్మక కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు కొరటాల శివ. చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ సంగీత రోల్ చాలా కీలకంగా ఉండనుందని, ఆ పాత్ర చిత్రానికి మేజర్ అసెట్ కానుందని తెలుస్తోంది. మణిశర్మ బాణీల్లో ఉర్రూతలూగిస్తున్న ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
By November 04, 2021 at 11:26AM
No comments