Breaking News

Rashmika Mandanna : డేటింగ్‌పై రష్మిక సెన్సేషనల్ కామెంట్స్.. అలాంటి అబ్బాయి కావాలంటున్న శాండిల్ వుడ్ బ్యూటీ


ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌లోనే కాదు.. బాలీవుడ్ సినిమాల‌తోనూ బిజీగా ఉంటున్న శాండిల్ వుడ్ బ్యూటీ త‌న డేటింగ్ చేయ‌బోయే కుర్రాడి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట సెన్సేష‌న‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ డేటింగ్ గురించి ఈ బ్యూటీ డాల్ అంతలా ఏం చెప్పింద‌నేగా సందేహం రాక మాన‌దు. అస‌లు విష‌యంలోకి వెళితే, రీసెంట్‌గా ర‌ష్మిక త‌న బాలీవుడ్ డెబ్యూ మూవీ మిష‌న్ మ‌జ్ను చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డి మీడియాతో మాట్లాడుతూ డేటింగ్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు త‌క్కువ వ‌య‌సులో ఉన్న అబ్బాయితోనైనా డేటింగ్ చేయ‌వ‌చ్చున‌ని, అబ్బాయి న‌చ్చ‌డ‌మే కాకుండా, సద‌రు అబ్బాయి మ‌న‌ల్ని మార్చేయ‌కుండా ఉండాలంటూ ర‌ష్మిక చెప్పింద‌నే న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. దీనిపై ర‌ష్మిక ఫ్యాన్స్‌కు ఏం చెప్పాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శాంత‌న్ భ‌గ్చీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న మిష‌న్ మ‌జ్ను సినిమా రియ‌ల్ ఇన్‌సిడెంట్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తుంద‌ని తెలుసుకోవ‌డానికి ఇండియా నిర్వ‌హించిన అతి పెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆధారంగానే ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అయితే అంత కంటే ముందుగానే ర‌ష్మిక బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మ‌రో భారీ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుంది. ఆ చిత్ర‌మే పుష్ప ది రైజ్‌. అల్లు అర్జున్ణ హీరోగా న‌టించిన ఈ సినిమాను సుకుమార్ తెర‌కెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్‌. మ‌రోవైపు ఈ సినిమా హిందీ విడుద‌ల‌కు సంబంధించి నిర్మాత అల్లు అర‌వింద్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. అంతా స‌క్సెస్ అయితే మిష‌న్ మ‌జ్ను కంటే ముందే ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ జ‌నాల‌ను ప‌ల‌క‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో పాటు గుడ్ బై అనే మ‌రో సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది. వికాస్ భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమాలో అమితాబ్ కుమార్తె పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నుంది. ఈ సినిమా కూడా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో గుడ్ బై సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. అంటే డిసెంబ‌ర్ నుంచి చూసుకుంటే వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోపు ఈ బ్యూటీ మూడు భారీ చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఇది కాకుండా శ‌ర్వానంద్‌తో క‌లిసి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ న‌టిస్తుంది. ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో సూపర్ స్టార్ మహేశ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి వారితో జత కట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తోనూ సై అనేసింది. ఒకవైపు స్టార్ హీరోలు, మరో వైపు మీడియం బడ్జెట్ హీరోలను బ్యాలెన్స్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా తనదైన ఇమేజ్‌తో దూసుకెళ్తోంది రష్మిక.


By November 13, 2021 at 01:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-openup-about-dating-with-younger-guy/articleshow/87681715.cms

No comments