గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్ట్‌లు హతం
మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో 8 నుంచి 10 మంది వరకూ మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. నిఘా వర్గాల సమాచారంతో మావోయిస్ట్‌ల కోసం భద్రతా బలగాలు గ్యారపట్టి ప్రాంతంలో గాలిస్తుండగా.. ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరగ్గా.. మావోయిస్టులు భారీ సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది. ఘటన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. గ్యారబట్టి అటవీ ప్రాంతంలోని ధానోరా వద్ద ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం భద్రతా బలగాలపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు. సీఆర్పీఎఫ్, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
By November 13, 2021 at 01:37PM
No comments