Pushpa : ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా..’ అంటున్న అల్లు అర్జున్.. పుష్ప నుంచి నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్!
ఐకాన్ స్టార్ , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో తొలి భాగంగా ది రైజ్.. డిసెంబర్ 17న విడుదలవుతుంది. ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ చూస్తుంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ లారీ డ్రైవర్‌గా ఉండే పుష్పరాజ్ .. అందరికీ నాయకుడిగా ఎలా ఎదిగాడని తెలియజేసేలా ఉందని, సాంగ్‌లో చిత్రీకరణ చూస్తుంటే బన్నీ ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కడం పక్కా. సాంగ్‌లోని ప్రతి లైన్ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ పాటను చంద్రబోస్ రాయగా.. నకష్ అజీజ్ పాడాడు. పుష్ప ది రైజ్ మూవీ నుంచి విడుదలైన నాలుగో లిరికల్ సాంగ్ ఇది. ఇప్పటి వరకు పుష్ప ది రైజ్ మూవీ నుంచి మూడు లిరికల్ సాంగ్స్ విడుదలయ్యాయి. దీందో ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్ప అంటూ హీరో పాత్రకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అన్నింటికీ చాలా మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు నాలుగోపాటగా వచ్చిన ఏ బిడ్డా ఇది నా అడ్డా..సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటించనున్నారు. అలాగే మంగళం శ్రీను పాత్రలో సునీల్, దాక్షాయణి పాత్రలో అనసూయ మెప్పించబోతున్నారు. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదలయ్యాయి. ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం సుక్కు అండ్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. నవంబర్ 25 నుంచి బన్నీ, సమంతలపై స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారు. ఐదు రోజుల పాటు ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఉంటుంది. దీంతో షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసి ప్రమోషన్స్‌పై ఫోకస్ చేస్తారు. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అది కూడా రెండు భాగాలుగా. ఈ సినిమా రెండో భాగం వచ్చే ఏడాది విడుదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు కనిపించని మాస్, రా అండ్ రగ్డ్ లుక్‌లో అల్లు అర్జున్ ఈ సినిమాలో పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదలవుతుంది.
By November 19, 2021 at 11:37AM
No comments