Breaking News

Pawan Kalyan : ‘భీమ్లా నాయ‌క్‌’ నైజాం రైట్స్ ద‌క్కించుకున్న నిర్మాత‌.. ఎంత ఖ‌ర్చు పెడుతున్నాడో తెలుసా?


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయ‌క్‌’. రానా ద‌గ్గుబాటి కూడా ఇందులో మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియమ్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌లు రాయ‌డంతో పాటు ఏకంగా పాట కూడా రాసేశారు. ఈ మూవీని ముందుగా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు రెడీ అయ్యారు. అయితే చివ‌రి నిమిషంలో RRR పోటీలోకి రావ‌డంతో సంక్రాంతి బ‌రిలో ఉన్న భీమ్లా నాయ‌క్ వెన‌క్కి వెళుతున్నాడ‌ని, జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్రోమోలు, పాట‌ల‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలోనూ మంచి పోటీ నెలకొంది. భీమ్లా నాయ‌క్ సినిమా నైజాం థియేట్రిక‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ద‌క్కించుకున్న‌ట్లు సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏకంగా నైజాం ఏరియాకే ఆయ‌న రూ.40 కోట్ల మేర‌కు చెల్లించార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వ‌కీల్‌సాబ్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా స‌త్తా చాటిన ప‌వ‌న్‌, ఇప్పుడు భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ అదే మ్యాజిక్ చేస్తార‌ని దిల్ రాజు భావిస్తున్నాడు. తెలుగు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్ర‌మ్ క‌థ‌లో మార్పులు, చేర్పులు చేశారు. నిత్యామీన‌న్ ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా న‌టిస్తుండ‌గా, రానా ద‌గ్గుబాటి స‌ర‌స‌న సంయుక్తా మీన‌న్ న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ స‌న్సియ‌ర్ ఫోలీస్ ఆఫీస‌ర్‌, వీఆర్‌సీ తీసుకున్న మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌కి మ‌ధ్య ఈగో స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌. ఈ సినిమాపై అంచ‌నాల‌కు బారీ ఉదాహ‌ర‌ణ‌.. రీసెంట్‌గా త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు వ‌చ్చిన రెస్పాన్సే. ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్ 24 గంట‌ల్లో 11.4 మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకుని యూ ట్యూబ్‌లో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. దీని త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇది పక్కా పీరియాడిక్ మూవీ. ఇందులో ప‌వ‌న్ బందిపోటు దొంగ పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌గా, ఇది పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లవుతుంది. ఈ మూవీని ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. దీని త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ సినిమాతో పాటు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ క‌మిట్ అయ్యున్నారు.


By November 15, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bheemla-nayak-nizam-theatrical-rights-sold-out/articleshow/87707210.cms

No comments