Breaking News

Nithya Menen : ఆ వ్య‌క్తి కార‌ణంగా నిత్యామీన‌న్ త‌ప్పు చేస్తుందా?.. మ‌ల‌యాళ బ్యూటీ డ్రీమ్ ప్రాజెక్ట్ రెడీ!


బాల‌న‌టిగా కెరీర్‌ను స్టార్ చేసిన నిత్యామీన‌న్ హీరోయిన్‌గా, న‌టిగా తెలుగు,తమిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో న‌టించారు. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే అలా మొద‌లైంది చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ మ‌ల‌యాళ బ్యూటీ ఇప్పుడు మ‌రో కొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఓ ర‌కంగా చెప్పాలంటే ధైర్యంతో ముంద‌డుగు వేస్తుంది. ఇంత‌కీ ఈమె అంత‌లా ఏ నిర్ణ‌యం తీసుకుంద‌నేదేగా మీ సందేహం.. అస‌లు విష‌య‌మేమంటే.. ఇప్పుడు నిత్యామీన‌న్ నిర్మాత‌గా మారింది. అది కూడా త‌న మాతృభాష మలయాళంలో కాదు.. తెలుగు సినిమాతో నిత్యామీన‌న్ నిర్మాత‌గా తొలి అడుగు వేసేశారు. ఇంత‌కీ నిత్యామీన‌న్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏదో తెలుసా? స్కైలాబ్‌. ఆమెతో పాటు స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ ఈ చిత్రంలో న‌టించారు. న‌టిగా మెప్పించారు. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆక‌ట్టుకున్న నిత్యామీన‌న్‌ను నిర్మాత‌గా మార‌డానికి ఇన్‌స్పైర్ చేసింది ఎవ‌రో తెలుసా..విశ్వ‌క్ ఖండేరావు. ఈయ‌నెవంటే డైరెక్ట‌ర్‌. నిత్యామీన‌న్‌ను క‌లిసి విశ్వ‌క్ స్టోరి వివ‌రించిన‌ప్పుడు క‌చ్చితంగా నిత్యామీన‌న్ సినిమాను క‌చ్చితంగా చేయాల‌నుకుంద‌ట‌. ఇంత‌కీ ఆమె ఏమందో ఆమె మాటల్లోనే.. ‘‘స్కైలాబ్‌ నాకు చాలా చాలా స్పెష‌ల్‌. డైరెక్ట‌ర్ క‌థ చెప్పిన‌ప్పుడు చాలా షాక్ అయ్యాను. ఎగ్జ‌యిట్ అయ్యాను. ఈ క‌థ‌ను ఎవ‌రు ఎందుకు సినిమాగా చేయ‌లేదు అని ఆలోచించాను. ఈ క‌థ గురించి మా అమ్మ నాన్న‌ల ద‌గ్గ‌ర కూడా మాట్లాడాను. వారు చాలా విష‌యాలు చెప్పారు. పాత జ‌న‌రేష‌న్‌కు తెలిసిన విష‌యం. నేటి జ‌న‌రేష‌న్‌కు కొత్త విష‌యం కాబ‌ట్టి సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని భావించాం. ఇలాంటి సినిమాలు చేయ‌డ‌మే నా డ్రీమ్‌.. వాళ్లు నాకు థాంక్స్ చెబుతున్నారు కానీ.. నేనే వాళ్ల‌కు థాంక్స్ చెప్పాలి. డిఫ‌రెంట్ మూవీ చేశాన‌నే ఫీలింగ్ ఇచ్చే సినిమా. ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా భాగ‌మైయ్యాను. చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా భ‌విష్య‌త్తులో ఇలాంటి సినిమాలు చేయాల‌ని నిర్మాత‌గా, న‌టిగా అనుకుంటున్నాను. విశ్వ‌క్ విజ‌న్‌ను మేం స‌పోర్ట్ చేశామంతే. త‌ను ట్రూ ఫిల్మ్ మేక‌ర్‌. త‌న ఇలాంటి సినిమాలు చేస్తానంటే నేను త‌న సినిమాల‌ను ప్రొడ్యూస్ చేస్తాను. నా కెరీర్‌లో ఓ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ను తొలిసారి క‌లిశాను. డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డ‌మే కాదు. అర్థం చేసుకోవాలి. ఆ విష‌యంలో పృథ్వీ ఓ అడుగు ముందున్నాడు. త‌ను ఓ డైమండ్‌లాంటి వ్య‌క్తి. విశ్వ‌క్‌, పృథ్వీతో క‌లిసి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను. సినిమాటోగ్రాఫ‌ర్ ఆదిత్య చాలా ప్యాష‌నేట్‌గా వ‌ర్క్ చేశాడు. మేం అంద‌రం మా గుండెల‌తో ఫీలై చేసిన సినిమా ఇది. హండ్రెడ్ ప‌ర్సెంట్ మూవీ స‌క్సెస్ అవుతుంది’’ అన్నారు. ఈ సినిమాకు పృథ్వీ పిన్న‌మ‌రాజు మెయిన్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే నిత్యామీన‌న్ కో ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నారు. ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతాన్ని అందించారు. ఇందులో గౌరి అనే విలేక‌రి పాత్ర‌లో నిత్యామీన‌న్ క‌నిపించ‌నుంది. 1979లో బండ లింగ‌ప‌ల్లిలో స్కైలాబ్ అనే ఉపగ్ర‌హం ప‌డిపోతుందని వార్త‌లు వచ్చిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా చూపించారు. అయితే నిర్మాతగా వ్యవహరించడం అంత సులువేమీ కాదు. ఆమె తప్పు చేస్తుందా అని కొందరు అనుకుంటుంటే, చాలా మంది ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.


By November 07, 2021 at 08:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithya-menen-turns-producer-for-sky-lab-movie/articleshow/87562740.cms

No comments