Breaking News

NASA వినువీధిలో ఈ శతాబ్దపు అద్భుతం.. కార్తీక పౌర్ణమి రోజున కనువిందు


వినువీధిలో మరో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఈ శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగహణం ( ) నవంబరు 19న ఏర్పడతున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ () శనివారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుందని తెలిపింది. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం ఉచ్ఛస్థితికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత ఇదే. చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చి.. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహం 3.28 గంటలపాటు కొనసాగనుందని పేర్కొంది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుందని, చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుందని తెలిపింది. ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కాగా... మే 26 న వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అరుణ వర్ణంలో చంద్రుడు కనిపించడాన్ని బ్లడ్‌ మూన్ (Blood moon), సూపర్‌ మూన్‌ (Super Moon)గా పిలుస్తారు. ఈ గ్రహణం అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో వీక్షించొచ్చు. అలాగే ఉత్తర అమెరికాలోని 50 దేశాలతో పాటు మెక్సికోలోనూ కనువిందు చేయనుంది. అమెరికా తూర్పు తీరంలో ఈ అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల వరకూ చూడొచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా పేర్కొంది. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది. ఈ గ్రహణం కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడుతుండగా.. మంచుతో కప్పబడిన చంద్రుడి ఫ్రాస్ట్ మూన్ ()గా అని పిలుస్తారు. శరదృతువు (Autumn Season) చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్‌కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పూర్తిగా కప్పివేసే సంపూర్ణ చంద్రగ్రహణంలా ఇది అద్భుతమైనది కానప్పటికీ, ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 97% కనిపించకుండా దాచేస్తుంది. వచ్చే 80 ఏళ్లలో 2021- 2100 మధ్య 20 సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ గ్రహణాలు ఏర్పడే అవకాశముందని నాసా వెల్లడించింది. 2001 నుంచి 2100 శతాబ్దం మధ్య అత్యంత ఈ పాక్షిక చంద్రగ్రహణమే సుదీర్ఘమైనది కాగా 21వ శతాబ్దంలో ఇప్పటి 228 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాదికి ఇదే ఆఖరి కాగా చివరి చంద్ర గ్రహణం కాగా.. వచ్చే ఏడాది 2022, మే 15-16 తేదీల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం (బ్లడ్‌ మూన్) ఏర్పడనుంది.


By November 07, 2021 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/longest-lunar-eclipse-of-this-century-will-happen-on-november-19-says-nasa/articleshow/87562700.cms

No comments