Breaking News

Nandamuri BalaKrishna : అత‌నితో వెళ్లి సారా తాగేవాడిని.. చిరంజీవి గురించి మనసులో మాట చెప్పిన మోహన్ బాబు


అసలు గురించి మీ అభిప్రాయం ఏంటి? అని నంద‌మూరి బాల‌కృష్ణ‌.. క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబుని ప్ర‌శ్నించిన‌ప్పుడు అస‌లు ఆయ‌న ఏం చెబుతాడోన‌ని అంద‌రిలో తెలియ‌ని ఆస‌క్తి నెల‌కొంది. ఆహాలో నంద‌మూరి బాల‌కృష్ణ టాక్ షో ‘అన్‌స్టాప‌బుల్’ దీపావ‌ళి సంద‌ర్భంగా ప్రసారమైంది. అంత‌కంటే ముందే విడుద‌లైన టీజ‌ర్‌లో మోహ‌న్‌బాబుని బాల‌కృష్ణ వేసిన ఈ ప్రశ్న నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. పూర్తి ఎపిసోడ్‌లో త‌న‌ను ప్ర‌శ్నించిన బాల‌య్య‌కు మోహ‌న్ బాబు ఏమ‌ని స‌మాధానం ఇచ్చారంటే... ‘‘చిరంజీవిపై వ్యక్తిగతంగా నాకెలాంటి చెడు అభిప్రాయం లేదు. ఆయ‌న‌తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించాను. త‌ను మంచి నటుడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. అల్లు రామ‌లింగ‌య్య‌గారి కుమార్తె సురేఖ‌ను చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోద‌రిలాంటిది. మ‌న ఇంటి అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు కాబ‌ట్టి బాగున్నాడు’’ అన్నారు. అలాగే త‌న‌కున్న మ‌ద్య‌పానం అల‌వాటు గురించి కూడా మోహ‌న్‌బాబు చెప్పారు. రాత్రి ఏడున్న‌ర త‌ర్వాత ఉన్న అల‌వాటు గురించి చెప్ప‌మ‌ని మోహ‌న్‌బాబుని బాల‌కృష్ణ ప్రశ్నించిన‌ప్పుడు.. ఆరోజుల్లో చేతిలో డ‌బ్బులు ఉండేవి కావు. కోడంబాకం బ్రిడ్జి కింద ఉండే సారాయి దుకాణానికి ఓ స్నేహితుడితో వెళ్లి సారాయి తాగేవాడిని. లేని రోజుల్లో సారాయి తాగాను. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కాబ‌ట్టి విస్కీ తాగుతున్నాను’’ అంటూ త‌న‌కున్న మ‌ద్యపానం అల‌వాటు ఆయ‌న బ‌హిరంగంగానే చెప్పుకున్నారు. మొట్ట‌మొద‌టిసారి నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా మారి ఆహాలో చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాప‌బుల్‌’. ఇందులో సినీ సెల‌బ్రిటీల గురించి బాల‌కృష్ణ వినూత్నంగా మాట్లాడుతూ వారి విష‌యాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను చెప్ప‌బోతున్నారు. అందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను మోహ‌న్‌బాబు అండ్ విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ల‌పై చిత్రీక‌రించారు. అది దీపావ‌ళి రోజున ప్ర‌సార‌మైంది. ఇక మిగిలిన ఎపిసోడ్స్‌కు సంబందించిన వివ‌రాలు తెలుస్తాయి.


By November 05, 2021 at 07:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohanbabu-opinion-on-chiranjeevi/articleshow/87531476.cms

No comments