Breaking News

my name is cleo చిన్నారి కిడ్నాప్.. హెలికాప్టర్లతో గాలింపు.. 18 రోజుల తర్వాత కథ సుఖాంతం


అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి కోసం పోలీసులు, అధికారుల ఆపరేషన్ 18 రోజుల తర్వాత ఫలించింది. నాలుగేళ్ల పాప ఆచూకీ కోసం ఆస్ట్రేలియాలో జరిగిన అన్వేషణ సుఖాంతమై చిన్నారి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాప ఆచూకీ లభించిన తర్వాత నీ పేరేంటి అని పోలీస్ అధికారి అడగ్గా.. ‘మై నేమ్‌ ఈజ్‌ క్లియో’ అని ఆ చిన్నారి సమాధానం ఇచ్చింది. దీంతో భద్రత బలగాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాయి. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించడం విశేషం. అక్టోబరు 16న చిన్నారి క్లియో.. తన తల్లిదండ్రులు జేక్‌ గిడ్డన్‌, ఎల్లీ స్మిత్‌‌లతో పెర్త్ రాష్ట్రంలోని క్యూబా బ్లూహోల్స్‌ పర్యాటక ప్రాంతానికి వెళ్లింది. సముద్ర తీరాన అడవికి దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలో వారు టెంట్ వేసుకుని విడిది చేశారు. తెల్లవారి నిద్రలేచి చూసే సరికి క్లియో కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆ ప్రాంతమంతా గాలించారు. అయినా, చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప ఆచూకీని కనిపెట్టడానికి 100 మంది అధికారులే కాకుండా పెద్దఎత్తున వలంటీర్లు రంగంలోకి దిగారు. క్లియో తల్లిదండ్రుల బహిరంగ అభ్యర్థన యావత్తు ఆస్ట్రేలియాను కదిలించింది. దేశం మొత్తం ఆ పాప క్షేమం కోసం ప్రార్థించింది. చిన్నారి ఆచూకీ చెబితే 10 లక్షల డాలర్లు రివార్డు అందజేస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. రంగంలోకి హెలికాప్టర్లు, నౌకలను దింపి.. గాలింపు చేపట్టారు. ఆపరేషన్ కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. చివరకు ఈ ప్రత్యేక ఆపరేషన్‌ 18 రోజుల తర్వాత ఫలించింది. పాపను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, ఓ ఇంట్లో ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారిని రక్షించిన పోలీసులు.. అనంతరం అనుమానితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ కిడ్నాప్‌నకు అతడికి ఎవరూ సహకరించలేదని తెలిపారు. బాలిక ఆచూకీ కోసం కృత్రిమ మేధస్సు, సాంకేతికత, సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోరెన్సిక్‌ విశ్లేషణలు ఉపయోగపడ్డాయని అధికారులు తెలిపారు. పోలీసుల్ని ప్రధాని మోరిసన్‌ అభినందించారు. స్థానిక పోలీస్ అధికారి కోల్ బ్లాంచ్ మాట్లాడుతూ.. ‘అనుభవజ్ఞులైన డిటెక్టివ్‌లు సైతం ఉద్వేగానికి గురయి.. ఏడ్వడం నేను చూశాను.. ఇది చాలా అరుదైన క్షణం... మాటల్లో చెప్పలేనింది... ఇది మనమందరం మనస్ఫూర్తిగా ఆశించింది...ఇది నిజమైంది’ అని అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు కూడా తమకు కష్టకాలంలో తోడుగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.


By November 04, 2021 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/australian-girl-who-vanished-from-campsite-found-alive-locked-house-close-to-home/articleshow/87520593.cms

No comments