Breaking News

ఢిల్లీలో ప్రమాదస్థాయిని దాటిన కాలుష్యం.. రాష్ట్రాలకు ఎమర్జెన్సీ ఉత్తర్వులు


దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి మించడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు శుక్రవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఉష్ణోగ్రత తగ్గుదల, గాలి వేగం కారణంగా ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొంది. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి అత్యవసర చర్యల కోసం పూర్తి సంసిద్ధతతో ఉండాలని రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలను పీసీబీ ఆదేశించింది. చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన పొగమంచు ఢిల్లీలో వ్యాపించింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఢిల్లీని పొగ మంచు కమ్మేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 470ని తాకింది. గాలిలో ఈ స్థాయి కాలుష్యం ఉంటేగాలి ఆరోగ్యకరమైన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. పొల్యూషన్ బోర్డ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్రకారం.. గాలిలో కాలుష్యం 48 గంటలపాటు తీవ్రంగా ఉంటుంది కాబట్టి పాఠశాలలను మూసివేసి, వాహనాలపై 'బేసి-సరి' విధానాన్ని అమలు వంటి అత్యవసర చర్యలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలను తప్పనిసరి చేయాలి. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు వ్యక్తిగత వాహనాలను 30 శాతం మేర తగ్గించుకోవాలని, నగరంలోని ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని శుక్రవారం రాత్రి విడుదల చేసిన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘నవంబర్ 18, 2021 వరకు కాలుష్య వ్యాప్తి నియంత్రణకు వాతావరణ పరిస్థితులు చాలా అననుకూలంగా ఉంటాయి.. రాత్రి సమయంలో తక్కువ గాలులు వీస్తాయి’ దీపావళి తర్వాత అమాంతం పెరిగిపోవడంతో నగర పరిసర ప్రాంతాల్లోని ఇటు బట్టీలను మూయించివేశారు. ఒక క్యూబిక్ మీటర్‌ గాలిలో PM2.5 గాఢత సగటున 329 మైక్రోగ్రాములు ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం.. 24 గంటల వ్యవధిలో ఒక క్యూబిక్ మీటర్ గాలికి 60ఎంజీలు సురక్షితమైనది. PM2.5 ఊపిరితిత్తులలోకి నేరుగా ప్రయాణించి, రక్త ప్రసరణలో ప్రవేశించేంత చిన్న రేణువులు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణం కావచ్చు. పంట వ్యర్థాలకు కాల్చివేతలు 3,000-5,000 పరిధిలో ఉన్నాయి కానీ, తగ్గడం లేదని ‘ఇది ఒక పీడకలగా మారుతోంది’ అని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ పరిధిలోకి వచ్చే ఎయిర్ క్యాలిటీ అండ్ వెదర్ మానిటర్ SAFAR వ్యవస్థాపక ప్రాజెక్ట్ డైరెక్టర్ గుఫ్రాన్ బేగ్ అన్నారు. శీతాకాలంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను కాల్చివేతలను తగ్గించడానికి గత నాలుగేళ్లుగా వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా ప్రయోజనం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది.


By November 13, 2021 at 07:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-air-quality-worsens-centre-pollution-board-says-prepare-for-emergency/articleshow/87676961.cms

No comments