Breaking News

సమంత నుంచి శుభవార్త! అలా విషయాన్ని బయటపెట్టడంతో ఇష్యూ హాట్ టాపిక్


గత నాలుగేళ్ళ క్రిందట అక్కినేని వారబ్బాయి నాగ చైతన్యతో పెళ్లి సమయంలో నిత్యం వార్తల్లో నిలిచిన సమంత.. రీసెంట్‌గా ఆ బంధాన్ని కట్ చేసుకున్నాక కూడా అలాగే వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. ఎవ్వరేమనుకున్నా తన ఆలోచనలు తనవే, తన దారి తనదే అన్నట్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించింది సామ్. ఈ క్రమంలోనే తన సామజిక మాధ్యమాల్లో పెడుతున్న ఒక్కో పోస్ట్ జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కడుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనే సందేహంలో పడిపోయి చర్చల్లో మునిగిపోతున్నారు ఆడియన్స్. నాగ చైతన్య- సమంత విడాకుల ప్రకటన అనంతరం, సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య మరింత పెరిగింది. అందుకు కారణం ఆమె ప్రతి దినం పెడుతున్న సందేశాలే. మోటివేషనల్ కోట్స్ షేర్ చేయడమే గాక తన లైఫ్ గురించి పరోక్షంగా పలు కామెంట్స్ చేస్తోంది సమంత. 'మై మామ్ సెడ్' అనే హ్యాష్ ట్యాగ్ వాడుతూ పలుమార్లు తనలో దాగి ఉన్న బలాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బయటపెట్టింది సామ్. ఇదే బాటలో తాజాగా ''గుర్తు పెట్టుకోండి.. ఎప్పడో శుభవార్త అయితే రాబోతోంది'' అనే సందేశంతో జనాల్లో చర్చలకు తెరలేపింది. సమంత పోస్ట్ చేస్తున్నవి మోటివేషనల్ కోట్స్ అయినప్పటికీ వాటికి ఆమె లైఫ్‌కి ముడిపెట్టి చూస్తున్నారు కొందరు. తన ఫ్యూచర్ గురించే సామ్ ఇలా హింట్స్ ఇస్తోందని అంటున్నారు. అలాగే తన మానసిక పరిస్థితిని ఇలా కోట్స్ రూపంలో ఆమె తెలియజేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే చైతూతో డివోర్స్ అయిన కొద్దిరోజులకే శుభవార్త అంటూ సామ్ పెట్టిన సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు.


By November 13, 2021 at 08:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-says-just-remember-there-is-always-good-coming/articleshow/87677434.cms

No comments