‘బైడన్ నా పాత్ర మిత్రుడే, కానీ..’ అమెరికా అధ్యక్షుడితో భేటీలో జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (, )సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. రెండు అగ్ర రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మన దేశాల మధ్య పోటీ ఉండాలి కానీ, అనాలోచితమైన సంఘర్షణకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’అని జింగ్‌పిన్‌తో అన్నారు. ఈ అంశంపై తాము ‘నిర్మాణాత్మకంగా’ చర్చిస్తామని ఆయన చెప్పారు. అటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. బైడెన్ ‘మా పాత మిత్రుడు’.. కానీ ప్రత్యర్థులు మరింత సన్నిహితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆయన అన్నారు. అంతేకాదు, ఇరు దేశాల మధ్య మరింత సహకారం, సమాచార మార్పిడి పెరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్‌తో రెండుసార్లు ఫోన్‌లో చర్చలు జరిపారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్‌గుర్‌లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. గతంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో చైనా ఉపాధ్యక్షునిగా ఉన్న జిన్పింగ్ను బీజింగ్లో కలిశారు. ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. కానీ దేశ అధ్యక్ష హోదాలో ఇద్దరు అగ్రనేతలు అధికారంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ భేటీకి ముందు వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకీ మాట్లాడుతూ.. ఇతర ప్రజాస్వామ్య దేశాలతో నెలల తరబడి సత్సంబంధాలు పునర్నిర్మించిన తర్వాత బలమైన స్థానం నుంచి బైడెన్ శిఖరాగ్ర సమావేశానికి వెళుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ‘చైనాతో ఆరోగ్యకరమైన పోటీ నిబంధనలను రూపొందించేందుకు ఒక అవకాశం.. వారి నాయకత్వాన్ని సరైన విధానంలో వెళ్లాలని సూచనలు చేయనున్నారు’ అని జెన్ సాకీ తెలిపారు. స్వయం పాలిత తైవాన్ సమీపంలో చైనా సైన్యం ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు ఎగరవేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది( over taiwan). తైవాన్ తమ భూభాగమే అని చైనా చెబుతోంది. బైడెన్తో భేటీలో ప్రధానంగా ఇదే సమస్యను లేవనెత్తినట్టు అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి( taiwan ). అయితే బైడెన్ మాత్రం గత అమెరికా ప్రభుత్వాలు అనసురించిన 'వన్ చైనా' పాలసీకే తాను కట్టుబడి ఉండనునున్నట్లు స్పష్టం చేశారు. తైవాన్తో సంబంధాలు, రక్షణ ఒప్పందాలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు తైవాన్ను సందర్శించినందుకు స్పందనగా గతవారం అక్కడ చైనా సైనిక బలగాలు యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. దీంతో బైడెన్-భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన వస్తుందనే ఆసక్తి నెలకొంది(us china news latest).
By November 16, 2021 at 08:51AM
No comments