ప్రియుడి కోరిక తీర్చడానికి లింగమార్పిడి చేసుకున్న యువకుడు.. చివరికి అడ్డం తిరిగిన కథ!
ఓ యువకుడితో ప్రేమలో పడిన వ్యక్తి... లింగమార్పిడి చేసుకుంటే ప్రేమగా చూసుకుంటాన్న ప్రియుడి మాటలు నమ్మి నిలువునా మోసపోయాడు. ప్రేమ కోసం ఏకంగా లింగ మార్పిడి చేసుకుని యువకుడు మోసపోయిన ఘటన ముంబయిలో వెలుగుచూసింది. కోల్‌కతాకు చెందిన జమాల్ షేక్(31) అనే యువకుడు 16 ఏళ్ల కిందట ముంబయికి వచ్చి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఫుర్‌ఖాన్ అనే యువకుడ్ని ప్రేమించాడు. దీంతో లింగమార్పిడి చేసుకుంటే మనిద్దం కలిసి బతకొచ్చంటూ జమాల్‌కు సూచించాడు. దీంతో ప్రియుడి మాటలు నమ్మి అతడి కోరిక మేరకు జమాల్.. లింగమార్పిడి చేయించుకుని శిల్పగా మారాడు. రూ.2 లక్షలు ఖర్చుచేసి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే, లింగమార్పిడి తర్వాత ప్రియుడు ముఖం చాటేశాడు. అతడు ముంబయి నుంచి ఢిల్లీకి పారిపోవడంతో జమాల్ అలియాస్ శిల్ప మోసపోయాయని గ్రహించింది. ఫుర్‌ఖాన్ తనను మోసగించి ఢిల్లీ పారిపోయాడని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. అవసరమున్న ప్రతిసారి తన వద్ద డబ్బులు తీసుకున్నాడని తెలిపాడు. అంతేకాదు, ఇంతకు ముందే ఫుర్‌ఖాన్‌కు వివాహం జరిగినా.. తనను ప్రేమించానని వెంటబడ్డాడని వాపోయాడు. అతడి మాటలు నమ్మి మోసపోయినట్టు జమాల్ గోడు వెలిబుచ్చాడు. అంతేకాదు, తల్లిదండ్రులు కూడా తనను కాదనుకుంటున్నారని వివరించాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా.. కేసు నమోదు చేయడం లేదని జమాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
By November 14, 2021 at 10:55AM
No comments