Breaking News

Allu Arjun : ‘పుష్ప’ నాలుగో సాంగ్ డేట్ ఫిక్స్ చేసిన టీమ్.. వైరల్ అవుతోన్న బన్నీ సరికొత్త లుక్!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. ఈ పాన్ ఇండియా సినిమాతో ఇటు అల్లుఅర్జున్‌, అటు సుకుమార్ ఏకంగా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి కూడా తెలిసిందే. ఒక ఐటెమ్ సాంగ్ మిన‌హా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. మూవీ రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేయ‌నుంది. అందులో తొలి భాగం ది రైజ్ డిసెంబ‌ర్ 17న సంద‌డి చేయ‌నుండేది విదిత‌మే. ఇప్పుడు బ‌న్నీ, సుక్కు, మేక‌ర్స్ అండ్ టీమ్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో పాట‌గా ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’ను న‌వంబ‌ర్ 19న‌ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే అందులో బ‌న్నీ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. తెలుగులో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో ఈ పాట‌ విడుద‌ల‌వుతుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన మ‌రో విష‌య‌మేంటో తెలుసా.. పుష్ప‌తో దేవిశ్రీ ప్రసాద్ కూడా పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ర‌చ్చ చేయ‌బోతున్నాడు. ఎంతో క్రేజీగా, శ్ర‌ద్ధ‌గా.. చేస్తున్న ఈ సినిమాపై అల్లు అర్జున్‌, సుకుమార్ అండ్ టీమ్ ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ప్ర‌తి చిన్న విష‌యంలోనూ ముందు నుంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇంట్రడ‌క్ష‌న్ ఆఫ్ పుష్ప టీజ‌ర్‌, మూడు పాట‌ల‌ను కూడా ఐదు భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఇప్పుడు నాలుగో పాట విష‌యంలో కూడా అదే విధంగా అడుగులు వేస్తున్నారు. శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈమెకు కూడా ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. మ‌లయాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ భైరాం సింగ్ అనే ఐపీయ‌స్ ఆఫ‌సీర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇత‌నే మెయిన్ విల‌న్‌. కాగా.. మ‌న టాలీవుడ్ నుంచి క‌మెడియ‌న్ సునీల్ మంగ‌ళం శ్రీను అనే మ‌రో విల‌న్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. వీరంద‌రి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్ విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడువుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సుకుమార్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో బ‌న్నీ ఆక‌ట్టుకోబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా బ్యానర్స్‌పై సినిమా రూపొందుతోంది.


By November 14, 2021 at 12:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-pushpa-fourth-single-update/articleshow/87695915.cms

No comments