ఎన్టీఆర్‌ను అలా చూపిస్తే ఒప్పుకుంటారా?... డైరెక్టర్ కాకపోయుంటే.. రాజమౌళి ఆసక్తికరమైన సమాధానాలు
దర్శకధీరుడు రాజమౌళికి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ, ఇప్పుడు సినిమాలు రూపొందాయి. అయితే RRRలో ఎన్టీఆర్‌తో పాటు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఓ కాలేజ్ ఈవెంట్‌లో పాల్గొని అక్కడున్న వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఆ క్రమంలో ఒకవేళ మీరు డైరెక్టర్ కాకపోయుంటే ఏమై ఉండేవారు అని ఒకరు ప్రశ్నిస్తే.. నాకు డ్రైవింగ్ వచ్చు.. కచ్చితంగా మంచి డ్రైవర్‌ను అయ్యేవాడిని అని చెప్పారు జక్కన్న. అలాగే RRRలో పాత్ర 30 నిమిషాలే ఉంటుందట కదా..నిజమేనా! అని మరొకరు ప్రశ్నించారు. నిజంగా అలా చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు చెప్పండి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చేశారు రాజమౌళి. బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా RRR..కావడంతో ఎంటైర్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇదొక ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా. ఇద్దరు స్వాతంత్య్ర సమర యోధులకు సంబంధించింది. ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా కనిపిస్తుంటే, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఈ ఇద్దరు యోధులు కలుసుకుని, గొడవపడి, బ్రిటీష్‌వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రమే RRR. ఇందులో ఎక్కడా చరిత్రను వక్రీకరించలేదని, అంతా ఫిక్షనల్ సినిమా అని రాజమౌళి ఇంటర్వ్యూలో తేట తెల్లం చేసేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్ మూవీ కావడంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ పరిశ్రమ అంతా ఎదురుచూస్తుంది. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, ఆలియా భట్‌తో పాటు శ్రియా శరన్, సముద్ర ఖని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అలాగే హాలీవుడ్‌కి చెందిన ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి కూడా కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో అగ్ర నటీనటులు చేసిన సినిమా కావడంతో సినిమా కలెక్షన్స్ పరంగా ఎలాంటి సంచనాలకు తెర తీస్తుందోనిన ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆసక్తి పెంచుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న రావడం పక్కా అయ్యింది. సోమవారం(నవంబర్ 1) ఉదయం 11 గంటలకు సినిమా నుంచి 45 సెకన్ల ఉండే గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతుందోనని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
By November 01, 2021 at 09:03AM
No comments