Breaking News

ఫుల్ బాటిల్ చేతబట్టి లుంగీ మడిచిన పవన్ కళ్యాణ్.. అసలైన మజా అంటే ఇదే మరి!


రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన .. మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. వచ్చి రాగానే 'వకీల్ సాబ్' రూపంలో భారీ హిట్ కొట్టేసిన పవర్ స్టార్ ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టి హవా నడిపిస్తున్నారు. డిఫరెంట్ కథలతో సరికొత్త రూపంలో దర్శనమిస్తూ హుషారెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు (నవంబర్ 4) దీపావళి కానుకగా తాజాగా విడుదల చేసిన '' పోస్టర్ నెట్టింట హంగామా చేస్తోంది. పవన్ మాస్ లుక్ చూసి ఊగిపోతున్నారు మెగా ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా 'భీమ్లా నాయక్' నుంచి నిన్న విడుదలైన 'లాలా బీమ్లా' సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. మాస్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్న ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఫుల్ కిక్ ఇచ్చాయి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు దివాలీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఫుల్ బాటిల్ చేతబట్టి లుంగీ మడిచిన పవన్ కళ్యాణ్ లుక్ మెగా అభిమానులను సరికొత్త ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాగర్. కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ కేటాయించి సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన అన్ని అప్‌డేట్స్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.


By November 04, 2021 at 12:49PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bheemla-nayak-diwali-special-poster-viral-on-social-media/articleshow/87522936.cms

No comments