Breaking News

‘పనీపాటులేని తాగుబోతులు.. మా వాళ్ల జోలికొస్తే గుడ్లు పీకి, చేతులు నరికేస్తా’ రైతులకు బీజేపీ ఎంపీ వార్నింగ్!


నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది నుంచి అన్నదాతల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటూ నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనపై హరియాణా బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. పానీపాటలేని తాగుబోతులే ఉద్యమాలు చేస్తున్నారని హరియాణా మాజీ మంత్రి మనీష్‌ గ్రోవర్‌ విమర్శించారు. దీంతో రోహ్‌తక్‌ జిల్లాలో ఆయన రైతులు నిరసనల సెగ తగిలింది. ఆలయానికి వచ్చిన ఆయనను చుట్టుముట్టారు. తమపై చేసిన వ్యాఖ్యలకు తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ.. ఓ ఆలయంలో ఉన్న ఆయన్ను బయటికి రాకుండా భారీ సంఖ్యలో రైతులు అడ్డుకున్నారు. ఎనిమిది గంటల పాటు ఆలయంలో ఉండిపోయారు. రైతుల పట్టువీడకపోవడంతో క్షమాపణలు చెప్పి బతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి బయటపడ్డారు. కానీ, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చారు. ‘మేం క్షమాపణ చెప్పలేదు.. ఈ గుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను’ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ ఘటనపై స్థానిక అరవింద్‌ శర్మ స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ కార్యక్రమంలోమాట్లాడుతూ.. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను ఎదురించేవారి కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని హెచ్చరించారు. అలాగే, కాంగ్రెస్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉండగా మరో 25 ఏళ్లయినా కాంగ్రెస్ ‌కు అవకాశం రాదని అన్నారు. కాగా, ఎంపీ బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. .బీజేపీకి చెందిన మరో ఎంపీ రాంచందర్ జాంగ్రా సైతం ‘నిరసనకారులంతా పనీపాట లేని తాగుబోతులంటూ’ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో హిసార్‌ జిల్లా నార్‌నౌంద్‌కు వచ్చిన ఆయన్ను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన కారు సైతం ధ్వంసమైంది


By November 07, 2021 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/will-gouge-eyes-cut-arms-haryana-bjp-mp-arvind-sharma-warns-to-farmers/articleshow/87563339.cms

No comments