Breaking News

Anushka Shetty : అనుష్కతో మూడో సినిమాను ప్రకటించిన నిర్మాణ సంస్థ.. హ్యాట్రిక్ హిట్ సాధ్యమయ్యేానా?


టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కొన్ని నెల‌లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది. అయితే ఆదివారం(న‌వంబ‌ర్ 7)న స్వీటీ పుట్టిన‌రోజు.. ఈ సంద‌ర్భంగా ఆమెతో తాము చేయ‌బోయే కొత్త సినిమాను అనౌన్స్ చేసింది నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్‌. దీనికి సంబంధించిన అనుష్క‌కు పుట్టిన‌రోజు శుభాకాక్ష‌లు తెలియ‌జేస్తూనే త‌మ సంస్థ‌లో ఆమె న‌టించిన రెండు చిత్రాల గురించి ప్ర‌స్తావిస్తూ మూడో సినిమాను తెలియ‌జేస్తూ యువీ క్రియేష‌న్స్ ఓ వీడియో విడుద‌ల చేసింది. ఇది వ‌ర‌కు యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో అనుష్క శెట్టి.. మిర్చి, భాగ‌మ‌తి చిత్రాల్లో న‌టించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్‌ను సాధించిన‌వే. అనుష్కతో యువీ క్రియేష‌న్స్ చేయ‌బోయే మూడో సినిమాను రా రా కృష్ణయ్య ఫేమ్ మ‌హేశ్ బాబు.పి తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించి అన‌ధికార వార్త‌లు వినిపిస్తూనే వ‌చ్చాయి. అయితే ఎట్ట‌కేల‌కు యువీ సినిమా గురించి అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా న‌టించ‌బోతున్నార‌ని, ఎక్కువ వ‌య‌సు ఉండే అమ్మాయి, త‌క్కువ వ‌య‌సు ఉండే అబ్బాయి మ‌ధ్య ప్రేమ పుట్టిన‌ప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు క‌లిగాయి. ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దాన్ని వారెలా అధిగ‌మించార‌నే క‌థాంశంతో సినిమా రానుందని దానికి శెట్టి అండ్ శెట్టి అనే పేరు కూడా పెట్టారంటూ వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అనుష్క‌తో సినిమాను అనౌన్స్ చేసిన యువీ క్రియేష‌న్స్ ఇత‌ర నటీన‌టులు గురించి అనౌన్స్ చేయ‌లేదు. అయితే ఇక్క‌డ పేర్కొనాల్సిన విష‌యం ఏంటంటే.. యువీ క్రియేష‌న్స్ రూపొందించిన తొలి సినిమా మిర్చిలో ప్ర‌భాస్ హీరో అయితే, ఆయ‌న‌కు జోడీగా అనుష్క న‌టించి ఆక‌ట్టుకుంది. త‌ర్వాత ఇదే సంస్థ‌లో అనుష్క న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత అనుష్క సైరా న‌రసింహారెడ్డిలో ఓ చిన్న రోల్ చేసింది. త‌ర్వాత ఆమె న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా అమెజాన్‌లో డైరెక్ట్ విడుద‌లైనా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. దీంతో చాలా రోజుల పాటు అనుష్క కెమెరాల‌కు దూరంగా ఉండిపోయింది. సైజ్ జీరో స‌మ‌యంలో అనుష్క త‌ను చేయాల‌నుకున్న పాత్ర కోసం పెరిగిన బ‌రువును త‌గ్గించుకోలేక‌పోయింద‌ని, దాన్ని త‌గ్గించుకోవ‌డానికే ఆమె ఇంత గ్యాప్ తీసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంటే కొత్త సినిమాలో కొత్త లుక్ ఉన్న అనుష్క‌ను చూడ‌బోతున్నామని స్వీటీ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాదితో అనుష్క నాలుగు ప‌దుల వ‌య‌సును పూర్తి చేసుకుంది.


By November 07, 2021 at 12:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/uv-creation-announced-third-movie-with-anushka-shetty-on-her-birthday/articleshow/87565138.cms

No comments