ఆర్యన్ హాజరైన ఆ పార్టీకి నన్నూ పిలిచారు.. కానీ,.. మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) సమీర్ వాంఖడేపై నవాబ్ మాలిక్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సమీర్ వాంఖడేను కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్‌కు అప్పగించారు. అయితే, ఆర్యన్‌ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, దీనికి సూత్రధారి వాంఖడే అంటూ మాలిక్ ఆరోపించారు. తాజాగా, ఈ వ్యవహారంపై మహారాష్ట్రకు చెందిన మరో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రూయిజ్ నౌకలో జరిగిన పార్టీకి తనను కూడా నిర్వహాకుడు కషిఫ్ ఖాన్ అక్టోబరు 2న ఆహ్వానించారని మంత్రి, కాంగ్రెస్ నేత అస్లామ్ షేక్ మంగళవారం తెలిపారు. మంత్రి అస్లామ్ సహా సీనియర్ మంత్రుల పిల్లలను క్రూయిజ్ పార్టీకి తీసుకొచ్చేందుకు నిర్వాహకుడు కషిఫ్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నించారని నవాబ్ మాలిక్ వ్యాఖ్యలు చేసిన మర్నాడే ఆయన స్పందించారు. క్రూయిజ్ నౌకలో పార్టీలో డ్రగ్స్ దొరికినట్టు ప్రకటించడం అంతా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వంపై మాలిక్ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కషిఫ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు.. ఎప్పుడూ కలవలేదు.. ముంబయి సంరక్షక మంత్రిగా బాధ్యతలు చూస్తున్న నాకు వివిధ కార్యక్రమాలకు ఆహ్వానం అందుతుంది.. అలాంటి ఆహ్వానాలలో ఇది ఒకటి’ అన్నారు. ‘నాకు గుర్తున్నంత వరకు నా మొబైల్ ఫోన్‌లో కషిఫ్‌తో మాట్లాడినట్లు నాకు గుర్తు లేదు.. నాకు కషిఫ్ తెలియదు.. అతను నాకు తెలియదు కాబట్టి మొబైల్ నంబర్ నా దగ్గర ఉండటం అసాధ్యం.. అతను ఎక్కడో (ఫంక్షన్) కలుసుకున్నాడు.. నన్ను ఆహ్వానించాడు.. అంతటితో విషయం ముగిసింది’ అని మంత్రి అస్లామ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై బురదు జల్లేందుకే బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేవలం ముంబయి క్రూయిజ్ నౌక కేసుపై బీజేపీ దృష్టిపెట్టింది తప్పా.. గుజరాత్ పోర్టులో వేల కోట్ల ఖరీదైన డ్రగ్స్ పట్టుబడితే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
By November 09, 2021 at 11:47AM
No comments