Breaking News

‘ఇదేనండీ మేం తినే భోజనం ఖర్చు’ మంత్రికి వాంఖడే భార్య దిమ్మదిరిగే కౌంటర్


ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ చేపడుతున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ () జోనల్ అధికారి సమీర్ వాంఖడే‌పై మహారాష్ట్ర మంత్రి ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఓ అడుగు ముందుకేసి.. పలువురిపై తప్పుడు కేసులు బనాయించి కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు. మంత్రి చేసిన ఆరోపణలపై సమీర్ వాంఖడే భార్య క్రాంత్రి రేడ్కర్ తీవ్రంగా స్పందించారు. మళ్లీ రేపు ఎప్పుడైనా తాము తినే తిండి గురించి ఎవరూ వ్యాఖ్యలు చేయకుండా ఆధారాలతో సహా ట్వీట్ చేస్తున్నానన్నారు. మధ్యాహ్న భోజనానికి చేసిన ఖర్చు గురించి ఆమె వెల్లడించారు. ‘మేం ఈ రోజు మధ్యాహ్న భోజనంలో దాల్‌ మఖ్నీ, జీరా రైస్ తీసుకున్నాం.. జీరా రైస్ ఇంట్లో తయారు చేసిందే. దాల్ మఖ్నీ బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. దాని ఖర్చు రూ.190. మళ్లీ భవిష్యత్తులో ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారికి సాధ్యంకాని రీతిలో మేం ఆహారానికి ఖర్చు చేస్తున్నాం అనొచ్చు. అందుకే ఆధారాలతో సహా వెల్లడిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో క్రాంతి వ్యంగ్యంగా స్పందించారు. బెదిరింపుల ద్వారా సమీర్ వాంఖడే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని, వసూళ్ల కోసం ప్రయివేట్ ఆర్మీని నియమించారని మాలిక్ ఆరోపించారు. ఓ లేడీ డాన్‌కు ఆర్మీతో భాగస్వామ్యం ఉందని నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియా ముందు ఓ వాట్సాప్ చాటింగ్‌ను మంత్రి బయటపెట్టారు. డ్రగ్స్ కేసులో పట్టుబడి జైల్లో ఉన్న నిందితుడితో సమీర్ వాంఖడే సోదరి న్యాయవాది యాస్మిన్ వాంఖడేకు సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు. యాస్మిన్ ఖాన్, ఓ గుర్తుతెలియని మొబైల్ నెంబరు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌‌ అంటూ పేర్కొన్నారు. ‘ఈ చాట్స్‌లో ‘లేడీ డాన్’ యాస్మిన్ వాంఖడే డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన వ్యక్తితో మాట్లాడుతున్నారు.. ఆమె తన విజిటింగ్ కార్డ్, చిరునామాను షేర్ చేస్తోంది. డ్రగ్ నిందితుడితో ఎన్‌సీబీ అధికారి సోదరి ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారు? అని మాలిక్ ప్రశ్నించారు. ‘సమీర్ వాంఖడే ధరించే షర్టు రూ.50 వేలు ఉంటుందని, టీ షర్టు రూ.30,000 ఉంటుందని.. రూ. 2 లక్షలు ఖరీదైన షూలు ధరిస్తారు.. ఆయన వాచ్ రూ.20 లక్షలు ఉంటుంది.. నిజాయతీగల అధికారి అయితే ఇంత ఖరీదైన వస్తువులను ఎలా వాడుతారు.. తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులతో కోట్లు వసూలు చేస్తున్నారు.. నిజాయతీపరుడైన అధికారి జీవితం ఇదే అయితే, దేశం మొత్తానికి మేం కోరుకుంటున్నాం’అని ధ్వజమెత్తారు. అయితే వీటిని సమీర్ ఖండించారు. అవన్నీ పుకార్లని సమీర్ కొట్టిపారేశారు. ఆయనకు వాటి గురించి పెద్దగా తెలిసుండదని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.


By November 03, 2021 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sameer-wankhede-wife-kranti-redkar-counter-to-navab-malik-allegations/articleshow/87499539.cms

No comments