Breaking News

Rashmika Mandanna : రష్మిక ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ద్వితీయ విఘ్నం దాటేస్తున్న బ్యూటీ డాల్


రష్మిక మందన్న... బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీకి ముహూర్తం క‌న్‌ఫ‌ర్మ్ అయిపోయింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా తెలియ‌జేస్తూ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. మేఘాల్లో విహ‌రిస్తున్న ఈ అమ్మ‌డు ఫ్యాన్స్‌కు ఇప్పుడు మ‌రింత హ్యాపీనెస్ వ‌చ్చిన‌ట్ల‌య్యింది. అస‌లు ర‌ష్మికకు అంత అనందాన్నిచ్చే విష‌యం ఎంట‌నే సందేహం ఇత‌రుల‌కు రాక మాన‌దు. అస‌లు విష‌య‌మేమంటే.. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ఇక్క‌డ అగ్ర హీరోలైన అల్లుఅర్జున్‌, మ‌హేశ్ వంటి వారితో జోడీ క‌ట్టింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. అందులో ముందుగా ర‌ష్మిక చేస్తున్న బాలీవుడ్ సినిమా మిష‌న్ మ‌జ్ను. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. వ‌చ్చే ఏడాది మే 13న ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స‌య్యింది. అంటే బాలీవుడ్ ప్రేక్షకులను ఆట్టుకోవ‌డంలో ర‌ష్మిక ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేసిన‌ట్లే మ‌రి. అయితే అంత‌క ముందే ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. అదెలాగంటే.. పుష్ప ది రైజ్ సినిమా రూపంలో. అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా డిసెంబ‌ర్ 17నే విడుద‌ల‌వుతుంది. ఆ సినిమాలో శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా విడుద‌లైన దాదాపు ఆరు నెల‌ల‌కు స్ట్ర‌యిట్ బాలీవుడ్ మూవీ అయిన మిష‌న్ మ‌జ్ను విడుద‌ల‌వుతుంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా రియ‌ల్ ఇన్‌సిడెంట్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తుంద‌ని తెలుసుకోవ‌డానికి ఇండియా నిర్వ‌హించిన అతి పెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆధారంగానే మిస్ట‌ర్ మ‌జ్ను రూపొందుతోంది. దీంతో పాటు గుడ్ బై అనే మ‌రో సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది. వికాస్ భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమాలో అమితాబ్ కుమార్తె పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నుంది. ఈ సినిమా కూడా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో గుడ్ బై సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. అంటే డిసెంబ‌ర్ నుంచి చూసుకుంటే వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోపు ఈ బ్యూటీ మూడు భారీ చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఇది కాకుండా శ‌ర్వానంద్‌తో క‌లిసి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ న‌టిస్తుంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఫ్యాన్స్‌కు హ్యాపీనెస్‌ను అందించ‌డానికీ అమ్మడు సిద్ధ‌మైంది.


By November 03, 2021 at 10:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-bollywood-movie-missionmajnu-release-date/articleshow/87500897.cms

No comments