Breaking News

వేలాది భారతీయ మహిళలకు ప్రయోజనం కలిగేలా బైడైన్ మరో కీలక నిర్ణయం!


వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలిగించే మరో కీలక నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు యంత్రాంగం తీసుకుంది. భారతీయ-అమెరికన్ మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ పర్మిట్‌లను పునరుద్దరించడానికి బైడెన్ యంత్రాంగం అంగీకరించింది. ఈ అంశంపై కొద్ది నెలల కిందట అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA)డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమీల్యాండ్ సెక్యూరిటీలో దాఖలు చేసిన వ్యాజ్యంపై సానుకూలంగా నిర్ణంయ తీసుకుంది. ‘H-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (EAD) పొడిగింపు కోసం తరుచూ రెగ్యులేటరీ పరీక్షలను నిర్వహిస్తుంటారు... కానీ, గతంలో దీనిని నిషేధించిన హోమీలాండ్ సెక్యూరిటీ రీ ఆథరైజేషన్‌ను నిలిపివేయడంతో చట్టబద్ధమైన కారణం లేకుండా వీరు ఉద్యోగాలను కోల్పోతున్నారు’ అని AILAకు చెందిన జోన్ వాస్డెన్ చెప్పారు. ‘ప్రస్తుతం L-2 జీవిత భాగస్వాముల ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ విషయంలో ఇది ఒక పెద్ద విజయం.. ఇది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ( ) స్థానంలో భారీ మార్పులకు దారి తీస్తుంది. ఇకపై ఎగ్జిక్యూటివ్, మేనేజర్ స్థాయి అధికారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేయడానికి ముందు ఈఏడీ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు’ అని AILA తెలిపింది. ‘వాస్డెన్ బనియాస్, స్టీవెన్ బ్రౌన్‌ల ప్రయత్నాల ద్వారా H-4 జీవిత భాగస్వాములకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం.. వలసేతర జీవిత భాగస్వాములకు సంబంధించిన వ్యాజ్యాన్ని పరిష్కరించడం సంతోషకరమైన విషయం.. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి’ అని AILA ఫెడరల్ లిటిగేషన్ డైరెక్టర్ జెస్సీ బ్లెస్ అన్నారు. ఒబామా హయాంలో హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వామికి వర్క్ ఆథరైజేషన్ అవకాశం కల్పించారు. ఇప్పటి వరకూ లక్ష మందికిపైగా హెచ్-4 వీసాలు జారీచేయగా... వీరిలో మెజార్టీ భారతీయ సంతతి మహిళలే ఉన్నారు. అయితే, దీని వల్ల స్థానికులు నష్టపోతున్నారని, అమెరికాలో ఉద్యోగాలు- స్థానికులకు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హమీ నెరవేర్చే ప్రయత్నంలో హెచ్-1బీ వీసాల జారీ విధానంలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు


By November 12, 2021 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/joe-biden-administartion-agrees-to-automatic-job-authorisation-for-spouses-of-h-1b-visa-holders/articleshow/87659466.cms

No comments