Breaking News

నేను పర్ఫెక్ట్ కాదు కానీ బలవంతురాలిని.. తగ్గేదే లే! మరోసారి ఆలోచనలు రేకెత్తించిన సమంత


నాగ చైతన్యతో డివోర్స్ అనంతరం దూసుపోతున్న తీరు ఆమెను నిత్యం వార్తల్లో నిలుపుతోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అప్‌డేట్స్ ఇస్తూనే అమ్మ చెప్పింది అనే ట్యాగ్ లైన్ వాడుతూ మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తోంది సామ్. ఈ నేపథ్యంలోనే తాజాగా నేను పర్ఫెక్ట్ కాదంటూ ఓ పోస్ట్ చేసి ఆలోచనలు రేకెత్తించింది ఈ స్టార్ హీరోయిన్. విడాకుల తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి బయట పడేందుకు తన స్నేహితులతో వరుస టూర్స్ వేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తున్న సామ్.. మరోవైపు సామాజిక మాధ్యమాల వేదికగా తన బలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో మళ్లీ నిలదొక్కుకునేంత సత్తా తనలో ఉందని, తగ్గేదే లేదని ఆమె పరోక్షంగా చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్స్‌స్టా వాల్‌పై ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''నేను బలవంతురాలిని.. నేను దేనినైనా భరిస్తాను.. నేను పర్‌ఫెక్ట్‌ కాకపోవచ్చు కానీ నాలో శక్తి ఉంది. నాలో ప్రేమ, దయ ఉన్నాయి. బట్ నేను ఎప్పటికీ వెనకడుగు వేయను. విపత్కర పరిస్థితుల్లో కూడా నేను విజయం సాధిస్తా. నేను మనిషిని, అలాగే నేను యోధురాలిని'' అని పేర్కొంటూ అమ్మ చెప్పింది అనే ట్యాగ్ జత చేసింది సామ్. అయితే తనలో దాగి ఉన్న పవర్ ఏంటనేది సమంత ఇంత స్ట్రాంగ్‌గా చెబుతుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇకపోతే విడాకుల వ్యవహారాన్ని పక్కనబెట్టి కెరీర్ పరంగా దూసుకుపోతోంది సమంత. కొత్త ప్రాజెక్టుల వేట మొదలుపెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెడుతోంది. ఇటీవలే 'శాకుంతలం' మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆమె.. మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అలాగే బాలీవుడ్‌లో తాప్సి ప్రొడక్షన్ హౌస్‌లో ఓ సినిమాకు కమిటైందట సామ్.


By November 02, 2021 at 02:04PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-ruth-prabhu-latest-post-on-her-strength/articleshow/87483998.cms

No comments