Breaking News

నా బార్య కంటే ముందు ఓ అమ్మాయికి ఎట్రాక్ట్ అయ్యాను.. రూపాయి సంపాదించ‌న‌ప్పుడు నా భార్యే నన్ను పోషించింది: రాజ‌మౌళి


‘‘నేను డైరెక్టర్ అవుదామని అనుకున్న సమయంలో చాలా కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడిని. అయితే మ‌ధ్య‌లో ఓ 8 నుంచి 18 నెల‌లు నాలో న‌మ్మ‌కం తగ్గిపోయింది. ఒక‌వేళ డైరెక్టర్ కాక‌పోతే ఏమ‌వ్వాలి. ఏ జాబ్ చూసుకోవాలి. నెల‌కు బ‌త‌కాలంటే ప‌దిహేను వేలు కావాలి. దాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి?’’ అని ఆలోచించానన్నారు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం పాన్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తోన్న వ్య‌క్తి ఈ మాట‌లు చెబితే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. కానీ ఈ మాట‌ల‌ను ఆయ‌నే చెప్పారు. రీసెంట్‌గా ఓ వేదిక‌పై ఆయ‌న మాట్లాడుతూ త‌న లైఫ్‌లో ప్రేమ గురించి వివ‌రించి అంద‌రికీ షాకిచ్చారు. ఇంకా ఈ వేదిక‌పై రాజ‌మౌళి మాట్లాడుతూ ‘‘డైరెక్ట‌ర్‌గా నాలో న‌మ్మకం త‌గ్గిపోవ‌డానికి కార‌ణం.. నేను ల‌వ్‌లో ప‌డ్డాన‌య్యా బాబు. ఇంత‌కీ ఎందుకు భ‌యం వ‌చ్చిందంటే.. ల‌వ్ అంటే భ‌యం కాదు, బాధ్య‌త కాదు. ఓసారి క‌మిట్ అయితే భార్యా పిల్ల‌ల‌ను పోషించాలి. చూసుకోవాలి. సినిమా అనేది నిల‌క‌డ లేని వృత్తి. స‌క్సెస్ వ‌స్తుంద‌నుకుని ఓ న‌మ్మ‌కంతో వెళ్లిపోతాం కానీ.. ఎప్పుడొస్తుందో తెలియ‌దు. నేను ల‌వ్ అని అంటున్నాను కానీ.. అది ఇన్‌ఫ్యాక్ష్యుయేష‌న్‌.. ఓ అమ్మాయితో క‌లిగిన ఎట్రాక్ష‌న్‌. నిజ‌మైన ప్రేమ మా ఆవిడ‌ను చూసిన త‌ర్వాతే క‌లిగింది. మ‌ధ్య‌లో నేను ఒకానొక టైమ్‌లో నేను పైసా సంపాద‌న కూడా సంపాదించ‌లేదు. నా భార్యే న‌న్ను పోషించింది. నేనేం సిగ్గుప‌డ‌లేదు. హ్యాపీగా బ‌తికాను. నా భార్య సంపాద‌న‌తోనే బ‌తికాను. నేను నా భార్య‌ను ఆఫీసులో డ్రాప్ చేసి వ‌చ్చేవాడిని. ఇంటికొచ్చి ఏదో రాసుకునేవాడిని. మ‌ళ్లీ సాయంత్రం త‌న‌ను ఇంటికి తీసుకొచ్చేవాడిని. నా భార్య ఇంటిప‌నులు, ఆఫీసు ప‌నులు చేసేది. అదే మా ప్రేమ‌క‌థ‌’’ అని అన్నారు రాజ‌మౌళి. ఈ స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. గోండు వీరుడు కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. ఇద్ద‌రు యోధుల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ క‌థతో 1940 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం. నాలుగు వంద‌ల కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను ఆకాశానంటేలా చేసింది. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్, శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర ఖ‌ని, ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి.. ఇలా పాన్ ఇండియా ఆర్టిస్టులు, హాలీవుడ్ ఆర్టిసుల కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్ర‌మిది.


By November 02, 2021 at 02:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajamouli-told-his-love-story/articleshow/87484205.cms

No comments