Breaking News

ఎద అందాలను హైలైట్ చేస్తూ ప్రగతి హల్చల్.. వయ్యారాల వల! క్షణాల్లో వీడియో వైరల్


సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను దున్నేస్తున్నారు నటీనటులు. ముఖ్యంగా హీరోయిన్స్ నిత్యం సామజిక మాద్యమాల్లోనే విహరిస్తూ తమ అందాలతో కుర్రకారుకు గాలం వేస్తున్నారు. ఇది నేటితరం హీరోయిన్ల తీరు అంటే ఓకే గానీ, ఈ లిస్టులో సీనియర్ నటి టాప్ ప్లేస్‌లో ఉంటోందని చెప్పుకోవడం విశేషమే. ఎప్పటికప్పుడు సరికొత్తగా సోషల్ మీడియాను షేక్ చేస్తుండటం హ్యాబీగా పెట్టుకుంది ప్రగతి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి పిచ్చెక్కించింది ఈ సీనియర్ తార. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ పాపులర్ అయిన ప్రగతి.. నాలుగు పదుల వయసులోనూ ఎంతో స్ట్రాంగ్ అని నిరూపించుకుంటోంది. అంతేకాదు తన లేటెస్ట్ లుక్స్, డాన్స్ వీడియోలతో కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా చేస్తోంది. ఇప్పటికే పలు డాన్స్ వీడియోలు, హాట్ వర్కవుట్స్, తీన్మార్ స్టెప్పులతో పరేషాన్ చేసిన ప్రగతి.. మరోసారి తన పవర్ చూపించింది. తాజాగా ఇన్స్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసి, ఎలాంటి స్టెప్పేయకుండానే చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకునేలా చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ప్రగతి షేర్ చేసిన ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె ధరించిన డ్రెస్, ఆ నడక చూసి ఒక్కొక్కరి మతిపోతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హాట్ హాట్‌గా వయ్యారాలు ఒలకబోస్తూ క్యాట్ వాక్ చేసింది ఈ సీనియర్ బ్యూటీ. యమ స్టైలిష్ లుక్‌లో ఇలా ప్రగతి విశ్వరూపం చూసిన నెటిజన్లు మైమరిచిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ''వావ్.. బ్యూటిఫుల్ ప్రగతి ఆంటీ, హీరోయిన్లను మించిన అందం ఇది, పిచ్చెక్కించావ్ మేడం, మీ కాన్ఫిడెన్స్ చూసి పడిపోయా, మాటల్లేవ్ అంతే'' అంటూ రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు. ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ పరంగా చూస్తే జెట్ స్పీడులో దూసుకుపోతోంది ప్రగతి. ఆమె ఎప్పుడు ఏ వీడియో వదులుతుందా? అని నెటిజన్లు ఆతృతగా ఎదురుచూసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ వయ్యారి భామ.


By November 02, 2021 at 07:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-pragathi-latest-hot-video-viral-on-social-media/articleshow/87476978.cms

No comments