Breaking News

లైవ్‌లో హీరోయిన్‌తో బాలకృష్ణ..! ఇది అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. వీడియో వైరల్


సినిమాలు, రాజకీయాలే కాదు.. ''అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం'' అని గర్జిస్తూ నేరుగా ఆన్ లైన్ వేదికలపై అడుగుపెట్టిన నందమూరి నటసింహం యమ స్పీడులో దూసుకుపోతున్నారు. హోస్ట్‌గా తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి నందమూరి అభిమానులను మరింత హుషారెత్తిస్తున్నారు. తొలిసారి ఆహా కోసం '' హోస్ట్‌గా మారిన బాలయ్య బాబు.. ఆ వేదికపై చేస్తున్న హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. ఈ షో తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌ బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీకరించారు. దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారమైన ఈ షో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదటి షోతోనే ఆన్ లైన్ వేదికపై బాలయ్య మార్క్ కనిపించింది. ఇక రీసెంట్‌గా 'అన్‌స్టాపబుల్' సెకండ్ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజ్ కాగా, అందులో నాచురల్ స్టార్ నానితో ఆట సంబరంలో హంగామా చేస్తూ కనిపించారు బాలకృష్ణ. ఈ ఎపిసోడ్ నవంబర్ 12న ప్రసారం కానుంది. ఇంతలో తాజాగా 'అన్‌స్టాప‌బుల్' ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ అదే వేదిక‌పై హీరోయిన్ పూర్ణ‌తో క‌లిసి బాల‌కృష్ణ చిందులేసిన వీడియోని విడుద‌ల‌ చేసింది ఆహా ఓటీటీ. ఇందులో జింగిలాల జింగిలాల…జింజిలాలో అంటూ హీరోయిన్‌తో రెచ్చిపోయారు నటసింహం. నందమూరి నాయకా అంటూ పూర్ణ ఇస్తున్న పుష్‌తో లైవ్ లోనే బాలయ్య బాబు మరింత హుషారెత్తిపోయారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏజ్‌లో బాలకృష్ణ ఎనర్జీ లెవెల్స్ చూసి ఫిదా అవుతోంది ప్రేక్షకలోకం.


By November 11, 2021 at 12:26PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/unstoppable-balakrishna-energetic-performance-with-heroine-poorna/articleshow/87642539.cms

No comments