Breaking News

Assam 20 ఏళ్ల నాటి కేసు.. మాజీ సీఎం కుమారుడ్ని అరెస్ట్ చేసిన సీబీఐ!


రుణ ఎగవేత కేసులో అసోం మాజీ ముఖ్యమంత్రి కుమారుడ్ని అరెస్ట్ చేసింది. మాజీ సీఎం హితేశ్వర్ సికియా తనయుడు అశోక్ సైకియాను సోమవారం ఉదయం దిస్పూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అసోం ప్రతిపక్ష నేత దేబబ్రత్ సికియాకు అశోక్ స్వయానా సోదరుడు. అశోక్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. రేపు ఉదయం ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. అశోక్ సికియా 1998లో రుణం తీసుకుని ఎగవేసినట్టు అసోం రాష్ట్ర సహకార, వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై గువహటి పల్టాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఈ కేసులోనే సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2001లో ఈ కేసును సీబీఐ స్వీకరించింది. అశోక్ సికియాపై సీబీఐ రెండు కేసులు నమోదు చేయగా.. ఒక కేసులో దోషిగా నిర్ధారణ అయ్యారు. అయితే, రాజీ పరిష్కార ఒప్పందం కింద 2011లోనే రుణాన్ని చెల్లించినట్టు సైకియా పేర్కొవడం గమనార్హం. ‘ఈ రుణ చెల్లింపునకు సంబంధించిన పత్రాలపై 2015లో అప్పటి బ్యాంకు జనరల్ మేనేజర్ సంతకం చేశారు. ఇది స్వార్థపరులు నాపై పెట్టిన తప్పుడు కేసు’ అని సైకియా ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ రుణ చెల్లింపునకు సంబంధించిన పత్రాలను షేర్ చేశారు. సోదరుడి అరెస్ట్‌పై దేబబ్రత్ సికియా సైతం స్పందించారు. ‘తాను ఇప్పటికే బాకీ మొత్తాన్ని తిరిగి చెల్లించానని, అందుకు సంబంధించిన పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు.. ఇప్పటికే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా కేసు నమోదు చేసినట్లయితే దర్యాప్తు సంస్థ బ్యాంకును ఎందుకు సంప్రదించలేదు. అలాగే, బకాయి మొత్తానికి సంబంధించి మా సోదరుడికి అనేకసార్లు నోటీసులు పంపామని సీబీఐ అధికారులు చెబుతున్నారు.. అయితే అక్కడే ఉన్న మా అమ్మ అలాంటి సమాచారం అందలేదని చెప్పారు’ అని స్పష్టం చేశారు.


By November 08, 2021 at 11:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-ex-chief-minister-hiteswar-saikia-son-arrested-by-cbi-in-loan-default-case/articleshow/87579605.cms

No comments