డెల్టా కంటే 6 రెట్ల వేగంతో ‘ఒమిక్రాన్’ వ్యాప్తి.. బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్!
కొత్తరకం కోవిడ్ వేరియంట్ (B.1.1.529) ప్రపంచాన్ని మరోసారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. అత్యంతా వేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ దేశంలో మూడో వేవ్‌కు కారణం అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ తీరును అంచనా వేస్తున్న నిపుణులు.. దేశంలో సెకండ్ వేవ్‌కి కారణమైన వేరియంట్ కంటే ఆరు రెట్లు ప్రమాదకరమని చెబుతున్నారు. అంతేకాదు, ఇది మనోక్లోనల్ యాంటీబాడీ, కాక్‌టెయిల్ చికిత్సలకు లొంగదని ఆందోళన చెందుతున్నారు. దక్షిణాఫ్రికా వద్ద ఉన్న ఒమ్రికాన్ ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తున్న నిపుణులు.. దీని వ్యాప్తి (ఆర్ వెల్యూ) డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉందని కలవరపడుతున్నారు. ఓమిక్రాన్ విషయంలో మరో ఆందోళనకర అంశం ఏమిటంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వేగంగా వ్యాపించడమే. ఈ వేరియంట్ వ్యాధినిరోధకతను ఏమార్చి వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. కరోనా తొలినాళ్లలో అద్భుత చికిత్సంగా పరిగణించిన మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్, మరణాలకు కారణమయ్యే డెల్టా వేరియంట్ ప్రతిస్పందిస్తుంది. దాని ఉపవర్గం డెల్టా ప్లస్‌పై మాత్రం ప్రభావం చూపలేదు. తాజాగా, ఒమ్రికాన్ సైతం మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌కు ప్రతిస్పందించదని ఆందోళన వ్యక్తమవుతోంది. IGIBకి రీసెర్చ్ స్కాలర్ మెర్సీ రోఫినా ప్రకారం.. ‘‘కొత్త వేరియంట్ ఖచ్చితంగా 32 స్పైక్ ప్రోటీన్‌లతో సహా మొత్తం 53 వేరియంట్‌లను కలిగి ఉంది.. చాలా రకాలుగా రోగనిరోధకశక్తిని నిరోధకత చూపుతున్నట్టు పరిశీలనలో తేలింది.. G339D,S373P,G496S,Q498R,Y505Hలలో ఆరు వేరియంట్‌లపై ఎటెసెవిమాబ్, బామ్లానివిమాబ్, కాసిరివిమాబ్, ఇండెవిమాబ్, ఇమ్‌డెవిమాబ్‌తో సహా మోనోక్లోనల్ యాంటీబాడీల చికిత్స సమర్ధవంతంగా పనిచేస్తోంది’’ ఇజ్రాయేల్‌లో టీకా వేసుకున్న వ్యక్తికి ఒమ్రికాన్ వేరియంట్ నిర్ధారణ కావడంతో ఇది బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కూడా పలు దేశాల్లో ఓమిక్రాన్ వ్యాప్తి సాధారణంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇజ్రాయేల్, హాంకాంగ్, బొట్సవానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్, బవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్ దేశాల్లో కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండగా.. సరిహద్దులను కూడా ఇప్పటికే మూసివేస్తున్నాయి. కొత్త వేరియంట్ ఉద్ధృతి నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. వైరస్ భయాలతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
By November 29, 2021 at 12:43PM
No comments