Breaking News

Vishnu Manchu : ‘మా’ ఫలితం.. మెచ్చుకున్న చిరు.. నొచ్చుకున్న నాగబాబు


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మెగా అండదండలతో బరిలోకి దిగాడు ప్రకాష్ రాజ్. ఇక మంచు ఫ్యామిలీ తన బలం, బలగాన్ని సమకూర్చుకుంది. సీనియర్ల మద్దతను కూడగట్టుకుంది. ఎక్కడెక్కడో ఉన్న వారినందరినీ దింపింది. అలా మొత్తానికి మంచు ఫ్యామిలీ మా అధ్యక్ష పీఠాన్ని అధీష్టించింది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇందులో ప్రకాష్ రాజ్ చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదంటూ, ఓ తెలుగోడినే అధ్యక్షుడిగా ఎంచుకోవాలంటూ లోకల్ నాన్ లోకల్ నినాదాన్ని లేవనెత్తారు. అయితే నాగబాబు మాత్రం దీనికి పూర్తిగా విరుద్దంగా నిల్చున్నాడు.ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయోచ్చని అన్నాడు. అలా బలంగా ప్రకాష్ రాజ్‌కు నాగబాబు మద్దతు ఇచ్చాడు. ఇక ఇదే విషయంలో కోట శ్రీనివాసరావును, ఆయన వయస్సును ఏ మాత్రం గౌరవించకుండా నాగబాబు నానా రకాల మాటలు అనేశాడు. అయితే మంచు విష్ణు గెలవడం, ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో నాగబాబు తెగ హర్ట్ అయ్యాడు. ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్లో "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు’ అని సంచలన పోస్ట్ చేశాడు. మరో వైపు మాత్రం విష్ణు గెలవడంతో అభినందించారు. ఆ టీంను మెచ్చుకున్నాడు. ప్రెసిడెంట్‌గా విష్ణు, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, ఎన్నికల్లో ఇతర సభ్యులు గెలవడంపై స్పందించాడు. ‘ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరికీ సంక్షేమానికి పాటు పడుతుందని ఆశిస్తున్నాను. మా ఇప్పటకీ ఎప్పటికీ ఒకటే కుటుంబం, ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’ అని అన్నారు.


By October 10, 2021 at 11:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-and-nagababu-on-manchu-vishnu-winning-maa-president/articleshow/86919662.cms

No comments