Manchu Vishnu: మంచు వారికే ‘మా’ పీఠం ... విష్ణు గెలుపుకు దోహదపడ్డ అంశాలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) ఎన్నికలు ఆదివారం (అక్టోబర్ 10) పూర్తయ్యాయి. తుది ఫలితాల తర్వాత ‘మా’ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. ఆయనకు 400పైగా ఓట్లు వచ్చాయి. ఆయన ప్యానెల్ నుంచి పోటీచేసిన సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయం సాధించగా, ట్రెజరర్‌గా శివబాలాజీ, నాగినీడుపై విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ప్యానెల్‌కు చెందిన శ్రీకాంత్, బాబూ మోహన్‌పై విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన ఉత్తేజ్‌తో పాటు విష్ణు ప్యానెల్‌కు చెందిన గౌతంరాజు విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే విష్ణు మంచు ప్యానెల్‌కు చెందిన 30 ఇయర్స్ పృథ్వీ, మాదాల రవి గెలిచారు. దాదాపు విష్ణు ప్యానెల్ ఈ మా ఎన్నికల్లో సక్సెస్ సాధించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల ఫలితాల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ముందంజ వేసింది. 18 స్థానాలకుగానూ 11 స్థానాల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు గెలిచారు. 7 స్థానాల్లో విష్ణు మంచు ప్యానెల్ సభ్యులు గెలిచారు. 1 స్థానం టై అయ్యింది. మూడు నాలుగు నెలల నుంచి ‘మా’ ఎన్నికల సందడి మొదలైందనే చెప్పాలి. ముందుగా ప్రకాశ్ రాజ్ తాను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్ విజయం తథ్యం అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా విష్ణు మంచు పేరు తెరపైకి వచ్చింది. ఆయన తాను పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. దీంతో ‘మా’ ఎన్నికల వేడి రాజుకుంది. అటు ప్రకాశ్ రాజ్, ఇటు విష్ణు మంచు తమ ప్యానెల్స్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి రెండు టీమ్స్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఒకానొక దశలో విష్ణు మంచు అధ్యక్షుడిగా గెలుస్తాడని, కానీ టీమ్ మాత్రం ప్రకాశ్ రాజ్‌దే గెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, ఎవరూ ఊహించని రీతిలో విష్ణు మంచు టీమ్ మెజారిటీ ఆఫీస్ బేరర్స్ స్థానాలను దక్కించుకుంది. అయితే విష్ణు మంచు ఈ గెలుపు సాధించడం వెనుక పక్కా ప్లానింగ్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మద్దతు కూడగట్టడం... సినీ పెద్దలు, సీనియర్స్ మద్దతుని కూడగట్టడంతో విష్ణు మంచు సక్సెస్ అయ్యారు. తన ప్యానెల్‌ను ప్రకటించిన రోజు నుంచి సినీ పెద్దలను కలుసుకుంటూ వచ్చారు. చిరంజీవి మినహా మిగిలిన వారిని విష్ణు నేరుగా వెళ్లి కలిశారు. అయితే ప్రకాశ్ రాజ్ తాను పెద్దలను ప్రశ్నిస్తానని అనడంతో పెద్ద చిక్కొచ్చి పడింది. యంగ్ స్టర్.. లోకల్ బాయ్ ‘మా’ ఎన్నికల్లో ప్రధానంగా వినిపించిన మరో అంశం లోకల్.. నాన్ లోకల్ ఇష్యూ. విష్ణు తెలుగువాడు కావడం. ముందు నుంచి హైదరాబాద్‌లో ఉంటాడనే పేరుంది. ఇక ప్రకాశ్ రాజ్ కన్నడవాసి అని, తను గెలిచినా ఎవరికీ అందుబాటులో ఉండడనే అంశాన్ని సభ్యులకు చక్కగా రీచ్ అయ్యేలా విష్ణు వర్గం వర్క్ చేసింది. అంతే కాకుండా విష్ణు యంగ్ స్టర్ మోహన్‌బాబు నిర్ణయాలు.. విష్ణుని ముందుండి నడిపించడంలో సినీ పెద్ద అయిన మంచు మోహన్‌బాబు కీలక భూమిక పోషించారు. సినీ పెద్దలను విష్ణుకు కనెక్ట్ చేయడంతో పాటు, ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ప్రతి మా సభ్యుడికి ప్రత్యేకంగా ఫోన్ చేసి విష్ణుకి ఓటు వేయాలని అభ్యర్థించారు. మేనిఫెస్టో... ‘మా’లోని పేద కళాకారుల కోసం విష్ణు అవకాశాలు, విద్య, చదువును, ఆరోగ్యాన్ని అందించే పథకాలను అమలు చేస్తానని ప్రకటించడం బాగా కలిసొచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రాబట్టుకోవడంలో విష్ణు ప్యానెల్ సభ్యులు ఓ అడుగు ముందుకు వేసి దాదాపు 50 ఓట్లను తనకు అనుకూలంగా సంపాదించుకున్నారు.
By October 10, 2021 at 11:03PM
No comments