MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు మంచు... అభినందనతెలిపిన లక్ష్మీ మంచు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) ఎన్నికలు ఆదివారం (అక్టోబర్ 10) పూర్తయ్యాయి. తుది ఫలితాల తర్వాత ‘మా’ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. ఆయనకు 381 ఓట్లు వచ్చాయి. ఆయన ప్యానెల్ నుంచి పోటీచేసిన సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయం సాధించగా, ట్రెజరర్‌గా శివబాలాజీ, నాగినీడుపై విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ప్యానెల్‌కు చెందిన శ్రీకాంత్, బాబూ మోహన్‌పై విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన ఉత్తేజ్‌తో పాటు విష్ణు ప్యానెల్‌కు చెందిన గౌతంరాజు విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే విష్ణు మంచు ప్యానెల్‌కు చెందిన 30 ఇయర్స్ పృథ్వీ, మాదాల రవి గెలిచారు. దాదాపు విష్ణు ప్యానెల్ ఈ మా ఎన్నికల్లో సక్సెస్ సాధించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల ఫలితాల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ముందంజ వేసింది. 18 స్థానాలకుగానూ 8స్థానాల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు గెలిచారు. 10 స్థానాల్లో విష్ణు మంచు ప్యానెల్ సభ్యులు గెలిచారు. విష్ణు మంచు మరియు అతని టీమ్‌కు కొత్తగా ఎన్నికైన ‘మా’ సభ్యులకు చిత్ర పరిశ్రమ, సెలబ్రిటీలందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీ మంచు విష్ణు విజయం అనంతరం.. నా తమ్ముడా మజాకా.. ఇదిగో నా హీరో అద్భుతమైన విజయం’ అన్నారు. అంతకు ముందే మనోజ్ .. విష్ణు, ప్రకాశ్ రాజ్ కలిసి సెల్ఫీ తీసుకున్న ఫొటోను షేర్‌చేసి ‘వాటమ్మా.. వాట్ దిస్ అమ్మా’ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
By October 11, 2021 at 12:22AM
No comments