Siddharth - Maha Samudram: స్టేజ్‌పై ఐ లవ్ యూ చెప్పిన సిద్ధార్థ్.. తొమ్మిదేళ్లు వెయిట్ చేశాడట
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్థ్ తర్వాత సక్సెస్‌లను కంటిన్యూ చేయకపోయాడు. అదే సమయంలో ఆయన తమిళ చిత్రాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. మంచి కథ దొరికితే కానీ, తెలుగులో సినిమా చేయనని భీష్మించుకుని కూర్చున్న ఆయన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ‘మహా సముద్రం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎమోషనల్ లవ్‌స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించారు. దసరా సందర్భంగా ఈ మూవీ అక్టోబర్ 14న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శర్వానంద్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమతో, ప్రేక్షకులతో తన అనుబంధం తెగిపోలేదని మంచి కథ కోసం 9 సంవత్సరాలు వెయిట్ చేశానని అన్నారు. చిత్ర యూనిట్‌ను అప్రిషియేట్ చేసిన సిద్ధార్థ్.. ఈ సినిమాలో నటించిన మరో హీరో శర్వానంద్‌పై ప్రశంసలు జల్లును కురిపించాడు. ఈ సినిమా వల్ల ఏమొస్తుందో ఏమో నాకు తెలియదు కానీ.. శర్వాలాంటి ఓ ఫ్రెండ్ దొరికాడని చెబుతూ స్టేజ్‌పై తనకు ఐ లవ్ యూ చెప్పాడు. తన వల్లనే మహా సముద్రం సినిమా ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందిందని చెప్పాడు. డైరెక్టర్ అజయ్ భూపతి ఆర్.ఎక్స్ 100తో స్పీడు చూపించాడు. ఇప్పుడు మహా సముద్రంతో మైలేజ్ కూడా ఉందని ప్రూవ్ చేయబోతున్నాడని చెప్పాడు. ఆర్జీవీగారి శిష్యుడితో ఓ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. కథను నమ్మి సినిమా చేసిన దర్శకుడు అజయ్. కొంచెం కూడా తనలో స్పీడు తగ్గలేదు. ఇది నా కమ్ బ్యాక్ మూవీ కాదు.. రీలాంచ్ మూవీ అని చెప్పిన సిద్ధార్థ్. నన్ను అజయ్ భూపతి కొత్తగా పరిచయం చేయబోతున్నాడని చెప్పాడు. మహా సముద్రం మూవీ ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందని చెప్పాడు సిద్ధార్థ్.
By October 09, 2021 at 11:02PM
No comments