Sharwanand: రాసుకోండి.. ‘మహా సముద్రం’ తెలుగువారందరూ మా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది
చాలా రోజులుగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్.. ‘’పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఎంత నమ్మకంగా అంటే స్టేజ్‌పై ఛాలెంజింగ్‌గా మాట్లాడేటంత. ‘మహా సముద్రం’ లో కథే హీరో. ప్రతి పాత్ర ఎమోషనల్, లోతుగా కనిపిస్తుందని చెప్పిన శర్వానంద్, శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ‘‘రాసుకోండి ‘మహా సముద్రం’ తెలుగువారందరూ ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకుంటారు. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. రావు రమేశ్‌గారు ఈ కథ గురించి చెబుతూ ఎక్స్‌ట్రార్డినరీ కథ అన్నారు. వెంటనే అజయ్ భూపతిగారిని పిలిపించి కథ విన్నాను. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాను. నిర్మాత అనీల్ సుంకరగారు కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. అజయ్ భూపతి రాసుకున్న కథ, క్యారెక్టర్స్ అంత గొప్పగా ఉంటాయి. 9 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇంత మంచి సినిమాను ఇచ్చిన అజయ్ భూపతిగారికి థాంక్స్. ఈ సినిమా ఒక లవ్‌స్టోరి. మహా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి పాత్రను అందరూ చేయలేరు. బలమైన ఎమోషన్స్ ఉండే పాత్ర. అదితి చాలా అద్భుతంగా నటించింది. అను ఇమ్మాన్యుయేల్ వండర్‌ఫుల్ కోస్టార్. అలాగే చుంచు మామ పాత్రలో జగపతిబాబుగారు గుర్తుంటారు. ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్ కూడా అద్భుతంగా సపోర్ట్ చేశారు. కరోనా సమయంలో చాలా కష్టపడి ఈ సినిమాను చేశాం. సిద్ధు..ఐ లవ్ యూ. సిద్ధులాంటి మంచి స్నేహితుడిని ఈ సినిమాతో సాధించాను. ఆల్ ఓవర్ ఇండియాలో సినిమాలు చేసిన సిద్ధు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇలాంటి లవ్‌స్టోరినీ ఈ మధ్యలో చూసుండరు. ఇలాంటి సినిమాను ఇప్పట్లో చూడలేరు. అక్టోబర్ 14న దసరాకు ప్రేక్షకులను పలకరించబోతున్నాం. ప్రతి పండగకు హిట్ కొట్టాను.. ఈసారి దసరాకు మహా సముద్రంతో హిట్ కొట్టబోతున్నాను’’ అన్నారు.
By October 09, 2021 at 11:31PM
No comments