EMK షో నుంచి మరో అదిరిపోయే వార్త.. సమంత తర్వాత గెస్ట్‌గా మిల్కీ బ్యూటీ?
జూనియర్ .. నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగారు. వెండితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో కింగ్ అనిపించుకున్న ఆయన, బుల్లితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. బుల్లితెర హోస్ట్‌గా సత్తా చాటుతూ ప్రతి ఇంట సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా చేసి బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరైన ఈ యంగ్ టైగర్.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి ఎందరో సెలబ్రిటీ గెస్ట్‌లు వచ్చారు. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్యతో విడిపోయిన సమంత ఈ షోకి గెస్ట్‌గా వచ్చారు. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ షోకి మిల్కీ బ్యూటీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారట. తారక్, తమన్నాలు గతంలో ‘ఊసరవెల్లి’ అనే సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య బాండింగ్ ఉంది. దీంతో తారక్, తమన్నాలు కలిసి ఈ షోలో కనిపిస్తే.. షో ఓ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని.. షో నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే మహేష్ బాబు, సమంతలు ఈ షోలో పాల్గొంటారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, దేనిపై కూడా అధికారిక సమాచారం లేదు. కానీ, ఇవి పక్కా అని చెప్పే విధంగా సోషల్‌మీడిమాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దసరా కానుకగా.. మహేష్ బాబు ఎపిసోడ్, దీపావళి కానుకగా సమంతల ఎపిసోడ్ ప్రసారం అవుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే తమన్నాతో కూడా త్వరలో షూటింగ్ జరుగుతుంది అని.. ఆ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా వస్తుంది అని తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. కానీ, ఇదే నిజం కావాలని తారక్, తమన్నా అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
By October 09, 2021 at 12:54PM
No comments