Breaking News

నిజంగా చెబుతున్నా.. ఇది చాలా చాలా స్పెషల్.. అదితిరావు హైదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్


శర్వానంద్, కాంబినేషన్‌లో రాబోతోన్న ‘’ సినిమాపై టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. Rx100 లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ఈ ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (శనివారం) రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై హీరోయిన్ మాట్లాడుతూ.. ''దాదాపు రెండేళ్ల తర్వాత ఇలా స్టేజి మీదకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాహా సముద్రం సినిమాను థియేటర్స్‌లో భారీగా రిలీజ్ చేస్తున్నందుకు ముందుగా నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో నన్ను 'మహా' అనే ముఖ్య పాత్రకు సెలెక్ట్ చేసుకున్నందుకు డైరెక్టర్ అజయ్ భూపతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ అజయ్ భూపతి గారు మమ్మల్ని ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సినిమా పట్ల ఆయనకున్న పాషన్‌పై ఎంతో గౌరవం పెరిగింది. కెమెరామెన్‌కి కృతజ్ఞతలు ఎన్ని చెప్పినా సరిపోవు. మహా పాత్రను చాలా బాగా చూపించారు. చేతన్ భరద్వాజ్ కూడా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనుతో కూడా ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా ఎంతో బాగా హార్డ్ వర్క్ చేశారు. నిజంగా ఈ మూవీ చాలా స్పెషల్‌గా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు.


By October 10, 2021 at 07:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aditi-rao-hydari-interesting-comments-at-maha-samudram-pre-release-event/articleshow/86905350.cms

No comments