Breaking News

Sarkaru Vaari Paata: కీర్తి సురేష్ పుట్టినరోజు కానుక అదుర్స్.. వైరల్ అవుతున్న స్పెషల్ పోస్టర్


ఈ రోజు (అక్టోబర్‌17) యంగ్ హీరోయిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు స్నేహితులు, తోటి హీరో హీరోయిన్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో '' టీమ్ కీర్తి సురేష్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపుతూ ఆమె లుక్ రివీల్ చేశారు. ఇది చూసి మహేష్ ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. విడుదలైన క్షణాల్లోనే ఈ పోస్టర్ వైరల్ అయింది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


By October 17, 2021 at 12:04PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hbd-keerthy-suresh-sarkaru-vaari-paata-team-released-new-poster/articleshow/87079083.cms

No comments