RRR యూనిట్‌తో హాలీవుడ్ సంస్థ చర్చలు... ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ప్లాన్ చేసిన జక్కన్న
యంగ్ టైగర్ , మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తుండటంతో పాటు ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీని డైరెక్ట్ చేసిన రాజమౌళి తెరకెక్కిస్తుండటం కారణాలు. వీటితో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ నటించడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాను ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి దాని అంచనాలు భారీ పెంచాలో తెలిసిన జక్కన్న తన ప్లానింగ్ ప్రకారమే ఇప్పుడు ‘RRR’ ఫీవర్‌ను పెంచడానికి ప్రయత్నాలు షురూ చేశారట. ఎందుకంటే ఇక సినిమా విడుదలకు రెండు నెలల సమయమే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై అంచనాలను పెంచేలా జక్కన్న అండ్ టీమ్ ముందుకు వెళుతుంది. ఈసారి ఇండియా సినీ ప్రేమికులనే కాకుండా ఓవర్‌సీస్ ఆడియెన్స్‌పై కూడా రాజమౌళి ఫోకస్ చేశారట. అందుకోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇప్పటికే నిర్మాత డి.వి.వి.దానయ్య, రాజమౌళి కుమారుడు కార్తికేయ దుబాయ్‌కు చేరుకుని అక్కడ RRR ఈవెంట్‌ను నిర్వహించడానికి ఏ ప్లేస్ అయితే బావుంటుందా? అనే పనిలో ఉన్నారట. సినీ వర్గాల తాజా సమాచారం మేరకు ఓ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ RRR సినిమా ఇంగ్లీష్ వెర్షన్‌ను విడుదల చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తుంది. అందుకోసం జక్కన్న అండ్ టీమ్‌తో చరర్చలు జరుపుతుందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ హాలీవుడ్ సంస్థ ఏదో కాదు.. వార్నర్ బ్రదర్స్. నిజంగానే ఈ సంస్థ ఇంగ్లీష్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తే సినిమాకు ఉండే క్రేజే మరో రేంజ్‌కు చేరుతుందనడంలో సందేహమే లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో యావత్ ప్రపంచం RRR కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తుంది. ప్రీ ఇండిపెండెన్స్ 1940 బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న RRR సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటీష్‌వారిని వీరిద్దరూ ఎలా ఎదిరించారనేదే కథాంశం. ఇప్పుడు మూడు గంటల పాటు వచ్చిన ఔట్‌పుట్‌ను రాజమౌళి తగ్గించి రన్ టైమ్‌ను 2 గంటల 45 నిమిషాలకు కుదించే ప్రయత్నాలు ప్రారంభించేశాడు. అలాగే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ టీజర్‌ను అన్ని భాషల్లో అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేస్తున్నారు.
By October 28, 2021 at 08:37AM
No comments