Breaking News

నేనేం తక్కువా? త‌గ్గేదే లే అంటున్న నాగార్జున‌.. అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌!


మారుతున్న ట్రెంఢ్‌ను ప‌ట్టేసుకుని అగ్ర హీరోలు కుర్ర హీరోల‌కు గ‌ట్టిపోటీనే ఇస్తున్నారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ స్టార్స్‌లో వెంక‌టేశ్‌, బాల‌కృష్ణ వంటి వారు డిజిట‌ల్ మాధ్య‌మంలో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ త‌న‌దైన మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో మాత్రం ఎందుక‌నో డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వలేదు. సాధార‌ణంగా ఇలాంటి ప్ర‌యోగాల‌కు ఆయనే ముందుంటారు. కానీ ఈసారి స్టైల్ మార్చారు. ఏదైతేనేం.. కాస్త ఆల‌స్య‌మైనా డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డానికి కింగ్ నాగార్జున రెడీ అయ్యార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఓ ప్ర‌ముఖ కోలీవుడ్ డైరెక్ట‌ర్ రీసెంట్‌గా కింగ్ నాగార్జున‌ను క‌లిసి ఓ స్పై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌ను వివ‌రించార‌ట‌. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చేసింది. బేసిగ్గా ఆ ద‌ర్శ‌కుడు స్పై థ్రిల్ల‌ర్స్‌ను తెర‌కెక్కించడంలో దిట్ట‌. దీంతో నాగార్జున కూడా ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రోకాదు.. గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు తెలుగు ఓటీటీ మాధ‌మ్యం ఆహాతో పాటు నెటిఫ్లిక్స్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోస్‌లో బాల‌కృష్ణ..ఆహాలో అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షోతో మెప్పించ‌డానికి రెడీ అయిపోయారు. మ‌రోవైపు వెంక‌టేశ్‌, రానా నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో న‌టిస్తున్న సంగ‌తి కూడా తెలిసిందే. కాగా..ఆహా మ‌రో సీనియ‌ర్ స్టార్ మోహ‌న్‌బాబుతో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో నాగార్జున డిజిట‌ల్ ఎంట్రీ చేస్తార‌నే వార్త‌లు అక్కినేని అభిమానుల‌కు కిక్ ఇచ్చే విష‌య‌మే. మ‌రి అది ఎంత త్వ‌ర‌గా ఉంటుంద‌నేది వారు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే నాగార్జున త‌న‌యుడు నాగచైత‌న్య విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హారర్ థ్రిల్ల‌ర్ సిరీస్‌లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు మ‌రి. నాగార్జున అక్కినేని వైల్డ్ డాగ్ వంటి యాక్ష‌న్ మూవీ త‌ర్వాత ఘోస్ట్ అనే యాక్ష‌న్ మూవీలో రా ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. పుస్కూరు రామ్మోహ‌న్‌రావు, నారాయ‌ణ్ దాస్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే సొగ్గాడే చిన్ని నాయ‌నా ప్రీ క్వెల్ మూవీ బంగార్రాజు షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఈ సినిమాల షూటింగుల‌తో బిజీగా ఉంటూనే మ‌రో వైపు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు కింగ్ నాగార్జున‌.


By October 28, 2021 at 07:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akkineni-nagarjuna-digital-entry-with-web-series/articleshow/87323859.cms

No comments