RRR రన్ టైమ్ లాక్ చేసిన జక్కన్న.. ప్రమోషన్స్ కోట్లు పెడుతున్న నిర్మాత
పాన్ ఇండియా ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ ’. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడంతో బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్ మూవీ కావడంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ పరిశ్రమ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర నటీనటులు చేసిన సినిమా కావడంతో సినిమా కలెక్షన్స్ పరంగా ఎలాంటి సంచనాలకు తెర తీస్తుందోనిన ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆసక్తి పెంచుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న రావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పేస్తున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు రెండు, మూడు సార్లు సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం డేట్ ఫిక్సయిపోండని జక్కన్న అందరికీ చెప్పేశాడట. తాజా సమాచారం మేరకు దర్శక ధీరుడు రాజమౌళి RRR రన్ టైమ్‌ను లాక్ చేశాడట. సినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలని న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రెండున్నర గంటలు ఉంటేనే ఎక్కువ. కానీ.. రాజమౌళి తన సినిమాకు 165 నిమిషాలు ఫిక్స్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే రాజమౌళి గత చిత్రం బాహుబలి రెండు భాగాలు కూడా రెండున్నర గంటలకు పైగానే రన్ టైమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే పంథాలో ఈసారి కూడా RRR రన్ టైమ్‌లను 165 నిమిషాలుగా రాజమౌళి ఫిక్స్ చేశాడని సినీ వర్గాలంటున్నాయి. ఇక రాజమౌళి తుది మెరుగులు దిద్దే పనిలో కూర్చున్నాడట. సినిమా మరింత ఎఫెక్టివ్‌గా రావాలంటే ఏం చేయాలనే దానిపై జక్కన్న తీవ్రంగా యోచిస్తున్నాడట. మరోవైపు RRR విడుదలకు 75 రోజుల మాత్రమే ఉంది. ఈ టైమ్‌లో ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్‌ను రాజమౌళి అండ్ టీమ్ సిద్ధం చేసిందట. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్, రామ్‌చరణ్ అండ్ టీమ్‌ను సిద్ధం కావాలని రాజమౌళి ఇప్పటికే సూచనలు చేసేశాడట. ప్రమోషన్స్ కోసం ఎంటైర్ టీమ్ భారతదేశంలోని ప్రముఖ పట్టణాలకు వెళ్లనుంది. అందుకోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లయిట్‌ను బుక్ చేస్తున్నారట. ఖర్చు ఎక్కువే అయినా సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య భారీగానే ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీ ఇండిపెండెన్స్ 1940 బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటీష్‌వారిని వీరిద్దరూ ఎలా ఎదిరించారనేదే కథాంశం. ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరన్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా నటించారు.
By October 25, 2021 at 11:19AM
No comments