Breaking News

Pushpa: చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే..! ఫిదా చేసిన రష్మిక- అల్లు అర్జున్ జోడీ


హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '' మూవీ నుంచి ‘శ్రీవల్లి’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. చిత్రంలోని రోల్‌పై షూట్ చేసిన ఈ సాంగ్ ట్యూన్స్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ''చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే'' అంటూ సాగిపోతున్న ట్యూన్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్‌గా మారింది. తన ప్రేయసి శ్రీవల్లి (రష్మిక మందన) చూపులకు ముగ్ధుడై.. ఆమెపై ఉన్న ప్రేమను పుష్ప రాజ్‌ (అల్లు అర్జున్) తెలియజేస్తున్నట్లు ఈ పాటను రూపొందించారు. చంద్రబోస్ అందించిన లిరిక్స్ పై దేవి శ్రీ స్వరాలు అందించగా సిద్ శ్రీరామ్‌ ఈ పాటను అలపించారు. మెలోడియస్‌గా సాగిపోతున్న ట్యూన్స్ సంగీత ప్రియులను ఫిదా చేస్తున్నాయి. గతంలో ఇదే అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య-2’ సినిమాలు సూపర్‌హిట్‌గా నిలవడమే కాక.. మ్యూజికల్‌గా కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు సుక్కు. డిసెంబర్ 17వ తేదీన తొలి భాగం ‘పుష్ప-ది రైజ్’ విడుదల కానుంది.


By October 13, 2021 at 12:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pushpa-the-rise-srivalli-full-song-released/articleshow/86986491.cms

No comments