భీమ్లా నాయక్ లేటెస్ట్ ప్రోమో.. ఆ మాటతో పవన్ కళ్యాణ్ అభిమానులను హుషారెత్తించిన తమన్
పవర్ స్టార్ అభిమానులను హుషారెత్తించే మరో వార్త మోసుకొచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ మూవీ లేటెస్ట్ ప్రోమో రెడీ అయిందని చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్‌తో ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో సెకండ్ సింగిల్ కూడా లోడ్ అవుతోందంటూ చేసిన ఈ ట్వీట్.. పవన్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. అక్టోబర్ 15న ఈ సాంగ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్, హీరోలుగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా '' సినిమా రూపొందిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. పవన్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చారు దర్శకనిర్మాతలు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
By October 13, 2021 at 10:55AM
No comments