Mega star Chiranjeevi - Godfather: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో హాలీవుడ్ స్టార్
‘ఆచార్య’ తర్వాత చేస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు ఇది రీమేక్. రీసెంట్‌గానే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ భాగమవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హాలీవుడ్ స్టార్ ఎవరో కాదు.. బ్రిట్నీ స్పియర్ అని టాక్. వివరాల్లోకెళ్తే, గాడ్ ఫాదర్ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ పాటను బ్రిట్నీస్పియర్‌తో పాడించాలని అనుకుని, ఆమెతో చర్చలు కూడా చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో ఓ క్లబ్ సాంగ్ ఉంటుంది. దాన్ని తెలుగులో బ్రిట్నీతో పాడిస్తారేమో మరి. ఈ వార్తలపై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందబోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నెటివిటీకి తగినట్లు మార్చి తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ విషయంలో పూరీ జగన్నాథ్, డైరెక్టర్ మోహన్ రాజాకు తన వంతుగా కొన్ని సలహాలు సూచనలు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు చిరంజీవి ఆచార్య ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. గాడ్‌ఫాదర్ మూవీ పూర్తి చేయగానే భోళాశంకర్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కూడా తమిళ చిత్రం వేదాళంకు రీమేక్. దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించనున్నారు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తిసురేశ్ నటిస్తున్నారు. అలాగే బాబి దర్శకత్వంలో మరో సినిమాను చేయడానికి చిరు రెడీగా ఉన్నారు.
By October 13, 2021 at 12:34PM
No comments