Puneeth Raj Kumar: పునీత్ హఠాన్మరణం..క్వశ్చన్ మార్క్‌లా మారిన రూ.400 కోట్ల మార్కెట్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/87383621/photo-87383621.jpg)
సినీ రంగంలో ఓ స్టార్ హీరో బాక్సాఫీస్ దగ్గర చూపించే ప్రభావం ఎంతో ఎక్కువగా బలంగా ఉంటుంది. నిర్మాతలే కాదు..డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. థియేటర్స్ యాజమాన్యం ఇలా అందరూ స్టార్ హీరో సినిమా సక్సెస్ కావాలనే కోరుకుంటారు. ఎందుకంటే స్టార్ హీరో సినిమా సక్సెస్ అయితే లాభాలను చూడొచ్చనేది వారి ఆశ. అలాంటి ఓ సక్సెస్‌ఫుల్ స్టార్ ఆకస్మాత్తుగా సుదూర లోకాలకు వెళ్లిపోవడం అనేది చాలా మందికి బాధనే మిగిలిస్తే.. బాక్సాఫీస్‌కు ప్రశ్నార్థకాన్ని చూపించింది. ఎందుకంటే ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ వేల్యూ రూ.400 కోట్లకు పైమాటేనని బాక్సాఫీస్ వర్గాల సమాచారం. ఎందుకంటే ఆయన సినిమా వస్తుందంటే తక్కువలో తక్కువగా వంద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పుడు ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. జేమ్స్, దిత్వ. ఈ రెండు సినిమాలకు ఒక్కో దానికి 50-60 కోట్ల రూపాయల బడ్జెట్‌ను అనుకుంటే రెండు సినిమాలకు కలిసి వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి సగంలోనే అగిపోతాయి. మరి ఈ దర్శక నిర్మాతల పరిస్థితేమిటో అంతు పట్టడం లేదు. ఇక పునీత్ రాజ్‌కుమార్ నిర్మాత కూడా తన సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేస్తుంటారు. ఆయనిప్పుడు ఏకంగా ఐదు సినిమాలు తన బ్యానర్‌లోనే ప్లాన్ చేసుకున్నారట. మినిమం అరవై కోట్ల బడ్జెట్‌తో మార్కెట్ యావరేజ్‌గా వేసుకున్నా.. అవన్నీ కలిపితే రూ.300 కోట్లకు పైగానే మార్కెట్‌పై ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మొత్తంగా కలుపుకుంటే నాలుగు వందల కోట్ల రూపాయల సినిమా బిజినెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సినిమాలను నమ్ముకున్న దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కానీ ఏం చేద్దాం.. విధి ఆడిన వింత నాటకంలో కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. ఇదీ అంతే. మంచి వ్యక్తి, రీల్ హీరోగా, రియల్ హీరోగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ముందుకు నడిపిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. ఇలా ఉన్నట్లుండి దూరమైపోవడం ఆయన కుటుంబంలోని వ్యక్తికే కాదు. సినీ ఇండస్ట్రీకి కూడా తీరని లోటే. పునీత్‌తో అనుబంధం ఉన్న వారెవరైనా ఆయన్ని అంత సులువుగా మరచిపోలేరు. భాషతో సంబంధం లేకుండా స్టార్స్, టెక్నిషియన్స్ అందరూ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై స్పందించారు. తమ సంతాపాలను వ్యక్తం చేశారు. శనివారం పునీత్ అంత్యక్రియలు జరుగుతాయి.
By October 30, 2021 at 07:54AM
No comments