Puneeth RajKumar: టాలీవుడ్‌లో అందరి బంధువయా.. పునీత్ రాజ్‌కుమార్
తెలుగు చిత్రసీమంటే కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మన నటీనటులను ఎంతగానో ఆదరించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విషయానికి వస్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండస్ట్రీతో అందరికంటే ఆయనే ఎక్కువ స్నేహ సంబంధాలను ఏర్పరుచుకున్నారు. ఇక్కడి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్రత్యేకంగా కలిసేవారు. ఫంక్షన్స్‌కు అటెండ్ అయ్యేవారు. తారక్‌ను నా సోదరుడు అనేవారు. ఆ అనుబంధంతోనే ఆయన హీరోగా చేసిన ‘చక్రవ్యూహ’లో ‘గెలయా గెలయా..’ అనే పాటను పాడారు తారక్. అలాగే నందమూరి బాలకృష్ణ అంటే కూడా ఎంతో ఇష్టం. ఆయన సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లినప్పుడు పునీత్ ఆయన పక్కనే కూర్చున్నారు. బాలకృష్ణ ముఖంపై ఏదో ఉంటే తన ఖర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. తానో పెద్ద హీరోననే ఫీలింగ్‌ను ఎక్కడా చూపించేవారు కాదు పునీత్. ఆర్య సినిమా చూసి బన్నీకి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన మంచితనం, కలుపుగోలుతనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చరణ్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే అందరికీ ఆయన్ని చాలా దగ్గర చేసిందని అందరూ అంటారు. కేవలం నటీనటులతో సత్సంబంధాలుండేవి కాదు. టెక్నీషియన్స్‌ను కూడా ఎంతగానో ఎంకరేజ్ చేసేవారు. పూరీ జగన్నాథ్, వీర శంకర్, మెహర్ రమేశ్ వంటివారు ఈ లిస్టులో ఉన్నారు. అసలు పునీత్ రాజ్‌కుమార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే తెలుగు దర్శకుడైన పూరీ జగన్నాథ్. తర్వాత కమర్షియల్ తెలుగు బ్లాక్‌బస్టర్స్‌ను కన్నడలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టారు. ఈ లిస్టులో రెడీ, ఒక్కడు, దూకుడు వంటి చిత్రాలున్నాయి. ఆంధ్రావాలా ఇక్కడ ప్లాప్ అయినా కర్ణాటకలో వీర కన్నడిగగా పునీత్ నటించారు. అలాగే ఒక్కడుని అజయ్‌గా రీమేక్ చేశారు. దీనికి మణిశర్మనే దర్శకుడు. అలాగే దూకుడు సినిమాను పవర్ పేరుతో రీమేక్ చేశారు. దానికి తమన్ సంగీతాన్ని అందించారు. దర్శకుడు వీర శంకర్, జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో సినిమా చేశారు. జనార్ధన మహర్షి ఈయన సినిమాలకు కథలను అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో పునీత్ వర్క్‌చేశారు. యువరత్న సినిమా విడుదల సమయంలో మీడియాతో మాట్లాడుతూ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నానని, త్వరలోనే ఆ కబురు చెప్తానని కూడా అన్నారు. అలా వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా సినిమాల్లో ఎప్పుడూ తెలుగు వారితో అనుబంధాన్ని ఆయన కొనసాగించారు పునీత్. అందుకనే తెలుగువారికి పునీత్ అంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. మన స్టార్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేవారు. అలాంటి ఓ మంచి వ్యక్తిని, స్నేహశీలిని కోల్పోవడం సినీ ఇండస్ట్రీకి పెద్ద లోటే. కేవలం సినిమాలతోనే కాదు, ఎంతో మంది ఆపన్నులకి అండగా నిలిచి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. చిన్న పిల్లలు, అనాథ పిల్లలకు విద్యను అందిస్తున్నారు పునీత్. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి దూరమవడం అందరికీ షాకింగ్‌గా అనిపిస్తుంది. సినీ సెలబ్రిటీలందరూ తమన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్కడ నుంచి ఆమె శనివారం బెంగళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరుగుతాయి.
By October 30, 2021 at 07:14AM
No comments