Breaking News

Prabhas25 - Spirit: ప్రభాస్ 25 ‘స్పిరిట్‌’ ..మ‌రో పాన్ వ‌రల్డ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన డార్లింగ్‌


బాహుబలితో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్ర‌భాస్ ఇప్పుడ‌న్ని అవే ప్రాజెక్ట్స్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఈయ‌న న‌టించ‌బోయే 25వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ చిత్రాల‌తో ఇటు ద‌క్షిణాది, అటు ఉత్త‌రాదిన సెన్సేష‌న‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే అధికారికంగా ప్ర‌క‌టించారు. సినిమా టైటిల్ ‘స్పిరిట్‌’. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ‘స్పిరిట్’ మూవీ విడుద‌ల కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. టి సిరీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని భూష‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను ప్ర‌క‌టింబోతున్నారు. సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ తన 25వ సినిమా చేస్తాడని చాలా వార్తలు వినిపించాయి. కానీ అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ డైరెక్టర్ రణభీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాతే ‘స్పిరిట్’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ తదుపరి నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్ కే పేరుతో నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఊపులో ప్రబాస్ మరో పాన్ వరల్డ్ మూవీ చేయడానికి సందీప్ వంగాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమాను ఎమోషనల్ కోణంలో సరికొత్తగా ఆవిష్కరించడంలో దిట్ట అయిన సందీప్ వంగా, ప్రభాస్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేస్తాడనంలో సందేహం లేదు. మరి ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.


By October 07, 2021 at 11:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas25-titled-as-spirit-under-sandeepreddyvanga-direction/articleshow/86831697.cms

No comments