Breaking News

MAAలో బ్లాక్‌మెయిలింగ్.. అలా చేస్తేనే సినిమా ఛాన్స్! ఆయన బండారం బయటపెట్టిన అజయ్ భూపతి


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రోజుకో ఇష్యూ బయటకొస్తోంది. ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకుతోందంటూ వస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మా అధ్యక్ష బరిలో ఉన్న , ప్యానల్ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో (అక్టోబర్ 10న) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో Rx 100 డైరెక్టర్ చేసిన ట్వీట్ సెన్సేషన్‌గా మారింది. ''నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా..'' అని అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన అజయ్ భూపతి.. దానికి 'మా' ఎలక్షన్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. అంటే మా ఎన్నికల వ్యవహారంలో బ్లాక్ మెయిలింగ్ కూడా షురూ అయిందని అర్థమవుతోంది. మరోవైపు విజయం తమదంటే తమదే అని రెండు ప్యానల్స్ ధీమాగా చెబుతున్నాయి. మంచు మోహన్ బాబు అయితే తన కొడుకు విష్ణు అధ్యక్షుడు కావడం పక్కా అని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ సైతం విజయం తనదే అని సవాల్ విసురుతున్నారు. ఈ పరిస్థితుల మడమ 'మా' ఎన్నికల ఇష్యూపై రీసెంట్‌గా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మా ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారని, ఓటుకు 10 వేలు ఇస్తున్నారని బహిరంగ వ్యాఖ్యలు చేశారాయన. ఇక ఇప్పుడు అజయ్ భూపతి కూడా అలాంటి మెసేజీనే పట్టడం పలు అనుమానాలు లేవనెత్తుతోంది. 'మా'లో బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయం మొదలైందని స్పష్టం చేస్తోంది.


By October 07, 2021 at 11:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-ajay-bhupathi-shocking-tweet-on-maa-elections/articleshow/86832302.cms

No comments