Nandamuri Balakrishna - Unstoppable: అన్ స్టాపబుల్’కు బాలకృష్ణ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే?
నందమూరి బాలకృష్ణ ...అన్‌స్టాపబుల్ అంటూ సరికొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో బాలయ్య హోస్ట్ చేయబోతున్న టాక్ షో. ఈ టాక్ షో దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన టీజర్ విడుదలైంది. అయితే ఈ టాక్ షో కోసం బాలకృష్ణ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం మేరకు అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం బాలకృష్ణ దాదాపు రూ.5కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అంటే ఎపిసోడ్‌కు నలబై లక్షలు చొప్పన రెమ్యునరేషన్ ఇస్తున్నారట. తొలి సీజన్‌లో 12 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే మొత్తంగా చూస్తే రూ.4.8 కోట్లు రెమ్యునరేషన్ దక్కుతుంది. ఈ టాక్‌షోలో టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, మోహన్‌బాబు, రామ్‌చరణ్ తదితరులు పాల్గొంటారని సమాచారం. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో మొదటగా మంచు ఫ్యామిలీ పాల్గొనబోతుందట. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు ఈ టాక్‌షోలో భాగం అవుతున్నారని టాక్. అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కూడా ఈ టాక్‌షోలో పాల్గొనబోతున్నారు. ఇలా అగ్ర తారలందరూ పాల్గొనబోయే ఈ షోను బాలకృష్ణ ఎలా ముందుకు తీసుకెళతాడనేది ఆసక్తికరంగా మారింది.
By October 17, 2021 at 11:22AM
No comments