Most Eligible Bachelor ట్విట్టర్ రివ్యూ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/87033685/photo-87033685.jpg)
అక్కినేని అభిమానులు హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చేసిన ప్రతీ సినిమా బెడిసికొడుతూ వచ్చింది. అయితే ఇంతలా ప్రేమ చూపిస్తోన్న అభిమానులకు తిరిగి హిట్ ఇచ్చే వరకు నిద్రపోన అంటూ ప్రమోషన్స్‌లో చెప్పిన అఖిల్.. ఈ చిత్రంతో మొదటి సక్సెస్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఎన్నో వాయిదాల అనంతరం చివరకు దసరా కానుకగా నేడు (అక్టోబర్ 15) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడిపోయాయి. ట్విట్టర్‌లో అయ్యగారి పేరు మార్మోగిపోతోంది. సినిమా ఫలితం కూడా బయటకు వచ్చింది. ట్విట్టర్‌లో నెటిజన్లు అఖిల్‌పై, సినిమాపై కామెంట్లు పెడుతున్నారు. సినిమా బాగుందని చెబుతున్నారు. ప్రథమార్థం బాగుందని, సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని మొత్తానికి ఓ సారి సినిమాను చూడొచ్చు అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు సినిమాకు కావాలిన నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు.. సినిమా బాగా లేదని చెబుతున్నారు. కానీ సినిమా సూపర్ ఉ:ది. మీరు వాటిని నమ్మకండి. ఇది బ్లాక్ బస్టర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కొందరు లెహరాయి సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్, ఆ పాట అద్బుతంగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పటికే కొందరు సినిమా మీద ట్రోలింగ్ కూడా మొదలుపెట్టేశారు. సినిమా ఏమీ బాగాలేదని, మళ్లీ డిసప్పాయింట్ చేసేశాడంటూ కొందరు నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు రివ్యూ మరి కాసేపట్లే రానుంది. ఇంతకీ అయ్యగారు హిట్ కొట్టారా? లేదా? నిజంగానే అయ్యగారు నెంబర్ వన్.. అఖిలే నెంబర్ వనే అనే టైటిల్‌కు న్యాయం చేశాడా? లేదా అనేది తెలుస్తుంది.
By October 15, 2021 at 06:24AM
No comments