Breaking News

Megastar Chiranjeevi: పేరు లేకుండానే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఏదో తెలుసా?


ఇప్పుడు 153వ సినిమాగా గాడ్‌ఫాద‌ర్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రిన్ని సినిమాల్లో న‌టించిన ఆయ‌న‌, ఏ సినిమాలో పేరు లేకుండా న‌టించారు..ఎలా చెప్ప‌డం అనే సందేహం రాక మాన‌దు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ రాధ‌, సుహాసిని న‌టించారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా యాక్ట్ చేశాడండోయ్‌. అదే న‌టుడిగా నాగ‌బాబు తొలి సినిమా కూడా. ఏంటి ఇన్ని క్లూస్ ఇచ్చిన చెప్ప‌లేరా? పోని లెండి.. మేమే చెప్పేస్తాం. ఆ సినిమా ఏదో కాదు.. ‘రాక్ష‌సుడు’. మెగాస్టార్, కోదండ‌రామిరెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ అది. 1986లో విడుద‌లైంది. అడ‌వి విల‌న్స్ మ‌ధ్య చిక్కుకున్న హీరో అత‌ని స్నేహితుడు అక్క‌డ నుంచి త‌ప్పించుకుని సిటీకి వ‌స్తారు. హీరో త‌న త‌ల్లిని వెతుకుతుంటాడు. ఆమె దొర‌క‌దు.. ఈ క్ర‌మంలో విల‌న్స్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడ‌నేదే ‘రాక్ష‌సుడు’ సినిమా క‌థ‌. మీరు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఇందులో హీరో పాత్ర‌కు పేరుండ‌దు. చిరంజీవి స్నేహితుడిగా న‌టించిన నాగ‌బాబు త‌న‌ను ఫ్రెండ్ అని, హీరోయిన్ రాధ పురుషా అని పిలుస్తుంటుంది. ఇలా త‌న పాత్ర‌కు ఏ పేరు లేకుండా చిరంజీవి న‌టించిన ఏకైక చిత్రం రాక్ష‌సుడు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. 28 కేంద్రాల్లో శ‌త దినోత్స‌వం జ‌రుపుకుంది. దీనికి ర‌జినీకాంత్‌, శ్రీదేవి, కె.విశ్వ‌నాథ్, ఎం.ఎస్‌.రెడ్డి ముఖ్య అతిథులుగా వ‌చ్చారు. ఇందులో శ్రీదేవి చేతుల మీదుగా చిరంజీవి జ్ఞాపిక‌ను అందుకోవడం విశేషం. చిరంజీవికి స‌న్నిహితుడైన కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రాసిన న‌వ‌ల ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కించారు.


By October 16, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-rakshasudu-movie-through-back-moment/articleshow/87054748.cms

No comments